Jayasudha: జయసుధ కొడుకుకు కలిసిరాని అదృష్టం.. ఐదేళ్లు కష్టపడి ఇప్పుడు ఇలా..

హీరోయిన్ గా ఆణిముత్యాలాంటి సినిమాలను అందించారు. ఒకప్పటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన జయసుధ ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి చాలా సినిమాల్లో నటించారు. హీరోలు , హీరోయిన్స్ కు తల్లిగా నటించి మెప్పించారు. టాలెంటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ జయసుధ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. భార్య భర్తలు ఈ ఇద్దరూ చాలా సినిమాల్లో నటించి మెప్పించారు.

Jayasudha: జయసుధ కొడుకుకు కలిసిరాని అదృష్టం.. ఐదేళ్లు కష్టపడి ఇప్పుడు ఇలా..
Jayasudha

Updated on: Feb 27, 2024 | 1:50 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు జయసుధ. హీరోయిన్ గా ఆణిముత్యాలాంటి సినిమాలను అందించారు. ఒకప్పటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన జయసుధ ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి చాలా సినిమాల్లో నటించారు. హీరోలు , హీరోయిన్స్ కు తల్లిగా నటించి మెప్పించారు. టాలెంటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ జయసుధ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. భార్య భర్తలు ఈ ఇద్దరూ చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే జయసుధ కొడుకు కూడా సినీ ఇండస్ట్రీలోకి అడగు పెట్టారు. మొదట్లో హీరోగా సినిమాలు చేసిన ఆయన ఆతర్వాత విలన్ గా మరి మెప్పించారు. ఇక ఇప్పుడు మరోసారి హీరోగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.

జయసుధ కొడుకు నిహార్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. నిహార్ హీరోగా బస్తి అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అసలు సినిమా వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ సినిమా తర్వాత విలన్ గా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. గ్యాంగ్ స్టార్ గంగరాజు అనే సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. కానీ నిహార్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇక ఇప్పుడు మరోసారి హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. నిహార్ హీరోగా రికార్డ్ బ్రేక్ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను చదలవాడ శ్రీనివాస్‌ నిర్మించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తమిళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిహార్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సినిమాకోసం ఐదేళ్లు కష్టపడ్డా.. ఎవరూ లేనివారికి అవకాశం కల్పిస్తే వారు ఎలా సాధిస్తారు కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కింది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా అని తెలిపాడు నిహార్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.