Jayaprada: ఆ హీరోకు అత్తగా నటించాను.. అతడే నా ఫేవరేట్.. జయప్రద కామెంట్స్..

భారతీయ చలనచిత్ర రంగంలో తన అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ జయప్రద. అభినయంతోపాటు అందంతో, సౌందర్యంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఒకప్పుడు హీరోయిన్ గా మెప్పించిన ఆమె.. తర్వాత సహయ నటిగా కనిపించింది. మాజీ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

Jayaprada: ఆ హీరోకు అత్తగా నటించాను.. అతడే నా ఫేవరేట్.. జయప్రద కామెంట్స్..
Jayaprada

Updated on: Jul 09, 2026 | 11:05 AM

సినీయర్ హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పరక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జయప్రద తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి, నందమూరి బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి, తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన కొన్ని చిత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆమె మూడు తరాల నటులతో కలిసి పనిచేశానని, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి తన సమకాలీనులతో పాటు బాలకృష్ణతో కూడా నటించానని తెలిపారు. బాలకృష్ణ గురించి మాట్లాడుతూ, ఆయనపై తనకు ఎంతో ఇష్టం ఉందని జయప్రద పేర్కొన్నారు. బాలకృష్ణ మొహమాటం లేకుండా, మనస్ఫూర్తిగా మాట్లాడే వ్యక్తి అని, ఆయన గుండె చాలా మంచిదని చెప్పుకోచ్చారు. ఆయన డైలాగ్ డెలివరీ అద్భుతమని, తన కెరీర్‌లో అలాంటి డెలివరీని చూశానని అన్నారు. బాలకృష్ణతో చిన్నతనంలోనే నటించలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని, అయితే ఆ తర్వాత “మహారథి” చిత్రంలో ఆయనకు అత్త పాత్రలో నటించానని గుర్తు చేసుకున్నారు. అలాంటి పవర్‌ఫుల్ పాత్రలు మళ్లీ చేయాలని తెలిపారు.

తన కెరీర్‌లో ఒక సంఘటనను జయప్రద గుర్తు చేసుకున్నారు. బాలయ్య సినిమా చిత్రీకరణ సమయంలో రాజమండ్రి నుంచి రైలులో ప్రయాణిస్తుండగా వరదలు వచ్చాయని, రైలు పట్టాలు కొట్టుకుపోయాయని తెలిపారు. రైలు ప్రమాదానికి గురయ్యే స్థితి నుంచి తృటిలో తప్పించుకుందని, మూడు రోజుల పాటు ట్రైన్‌లోనే ఆహారం లేకుండా చిక్కుకుపోయినట్లు వివరించారు. ఆ భయానక వాతావరణంలోనూ జనం “జయప్రద గారు బయటికి రావాలి” అని అరుస్తూ తనను గుర్తించడం, ఆకలితో ఏడుస్తున్న తనకు ఒక ఆఫీసర్ ఇంటి నుండి దాల్-చావల్ తీసుకువచ్చి ఇవ్వడం వంటి సంఘటనలు తన మదిలో చెరిగిపోనివిగా నిలిచిపోయాయని ఆమె పంచుకున్నారు.

తన కెరీర్‌లో మరపురాని చిత్రంగా “అంతులేని కథ” గురించి జయప్రద ప్రత్యేకంగా ప్రస్తావించారు. కమర్షియల్ చిత్రాలు ఎలా ఉన్నా, ఈ సినిమా తనకెంతో పేరు తెచ్చిందని, నేటికీ ఆ చిత్రంలోని పాత్రకు ప్రాధాన్యత ఉందని అన్నారు. ఒక కుటుంబంలో ప్రతి అమ్మాయి, ప్రతి తల్లిదండ్రులు కోరుకునే త్యాగపూరితమైన పాత్ర అది అని ఆమె వివరించారు. దర్శకుడు బాలచందర్ మొదట తమిళ వెర్షన్ చూపించినప్పుడు, అంత పెద్ద క్యారెక్టర్ ఎలా చేస్తానో అని భయపడ్డానని, అయితే ఆయన ఇచ్చిన లుక్, గెటప్ చాలా సహాయపడ్డాయని చెప్పారు. ఆ సినిమా చూసినప్పుడల్లా ఇప్పటికీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయని, ముఖ్యంగా ఆత్రేయ రాసిన “కళ్ళల్లో ఉన్నదేదో కనులకే తెలుసు” అనే పాట తనను ఎంతగానో కదిలిస్తుందని ఆమె తెలిపారు. తన కుటుంబాన్ని కాపాడటానికి ఒక అమ్మాయి పడిన త్యాగం, ఆమె ధైర్యం, సినిమా హీరోయిన్‌ను పరిచయం చేసిన తీరు అద్భుతమని జయప్రద అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

Loading...
Unable to load recommendations.
Follow Us