Jabardasth Praveen- Indraja: జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఇంద్రజ.. వీడియో ఇదిగో

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ ఓ వెలుగు వెలిగారు ఇంద్రజ. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తోన్న ఆమె సహాయక నటిగా రాణిస్తున్నారు. అలాగే బుల్లితెరపైనా మెరుస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోన్న ఆమె శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ సందడి చేస్తున్నారు.

Jabardasth Praveen- Indraja: జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఇంద్రజ.. వీడియో ఇదిగో
Actress Indraja, Jabardasth

Updated on: Nov 22, 2026 | 7:20 PM

జబర్దస్త్ జడ్జిగా కొనసాగుతున్న ఇంద్రజ ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్స్ అందరిని సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ ఉంటారు. సుడిగాలి సుధీర్ లాంటి ఎందరో జబర్దస్త్ కమెడియన్స్ ఇంద్రజను అమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటారు. తాజాగా ఈ సీనియర్ నటి ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ ఇంటికి వెళ్లారు. అంతేకాదు వెళుతూ వెళుతూ ప్రవీణ్ కూతురి కోసం చాలా గిఫ్టులు పట్టుకెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రవీణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాజాగా తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను రిలీజ్ చేసిన ప్రవీణ్ అందులో ఇంద్రజ తీసుకొచ్చిన కానుకులను అందరికి చూపిస్తూ ఎమోషనల్ గా మాట్లాడాడు. ‘ఇంద్రజ గారిని నేను అమ్మ అని పిలుస్తాను. ఆమె కూడా నన్ను సొంత కొడుకులాగే ప్రేమగా చూసుకుంటారు. నాకు పాప పుట్టిన రోజు తాను మొట్టమొదటిసారిగా ఇంద్రజ గారికి ఫోన్ చేసి పాప పుట్టిన విషయాన్ని చెప్పాను. హాస్పిటల్లో ఉన్న సమయంలో పాపని చూడటానికి ఇంద్రజ గారికి కుదరకపోవడంతో స్వయంగా ఇంటికి వచ్చారు. ఇంద్రజ గారు వస్తూ వస్తూ నా కూతురిని చూడటానికి వస్తూ పిల్లలకు అవసరమయ్యే అన్ని వస్తువులను తీసుకువచ్చారు. ఊయల నుంచి మొదలుకొని.. పాప కోసం ఉపయోగపడే బేబీ డ్రెస్సులు, ఊయల, బేబీ బెడ్, టవల్స్, డైపర్స్, లోషన్స్ వంటి పాపకు అవసరమైన అత్యవసరమైన వస్తువులన్నీ తీసుకొచ్చారు. అలాగే కొంత డబ్బును కూడా ఇచ్చారు’

‘ నా కుమార్తె కోసం ఇంద్రజమ్మ ఇచ్చిన ఈ కానుకలు చాలా విలువైవి. ఇవి అలాగే భద్రంగా దాచి పెద్దయిన తర్వాత కచ్చితంగా నా బిడ్డకు చూపిస్తాను. ‘ఇవి మీ అమ్మమ్మ తీసుకొచ్చినవరి నా కూతురుకు చూపిస్తాను’ అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు ప్రవీణ్. ఈవీడియోలో ప్రవీణ్ భార్య కూడా కడెం వంశిత కూడా ఇంద్రజ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఇంద్రజ గొప్ప మనసును మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ ప్రవీణ్ కూతురితో నటి ఇంద్రజ…

కాగా ఈ ఏడాది ప్రారంభంలో పటాస్ ప్రవీణ్ పెళ్లి పీటలెక్కాడు. ప్రముఖ నటి, డ్యాన్సర్ అయిన కడెం వంశితతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. తమ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఇప్పుడు ఓ పండంటి పాపను తమ జీవితంలోకి ఆహ్వానించారీ జబర్దస్త్ కపుల్.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us