Hebah Patel: లాక్‏డౌన్ సమయంలో తప్పులు తెలుసుకున్నాను.. ఇకపై అలాంటి తప్పులు చేయను.. హెబ్బా పటేల్..

|

Jun 22, 2021 | 11:24 AM

2014 వచ్చిన 'అలా ఎలా ?' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హెబ్బా పటేల్.. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన 'కుమారి 21ఎఫ్'

Hebah Patel: లాక్‏డౌన్ సమయంలో తప్పులు తెలుసుకున్నాను.. ఇకపై అలాంటి తప్పులు చేయను.. హెబ్బా పటేల్..
Hebah Patel
Follow us on

2014 వచ్చిన ‘అలా ఎలా ?’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హెబ్బా పటేల్.. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో హిట్ అందుకుంది ఈ ముంబై బ్యూటీ. తన చలాకీతనంతో… నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమా తర్వాత హెబ్బా పటేల్ సినిమాల విషయంలో కాస్తా తప్పటడుగులు వేసింది. దీంతో ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాల్లో కనిపించకుండా పోయింది. ఇటీవల నితిన్ ‘భీష్మ’ సినిమాల తలుక్కున మెరిసి.. రామ్ ‘రెడ్’ సినిమాలో కనిపించింది.

కెరీర్ ప్రారంభంలో ‘కుమారి 21 ఎఫ్’, ‘ఈడోరకం, ఆడోరకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత హెబ్బా పటేల్.. సినిమాల ఎంపిక విషయంలో కొన్ని తప్పులు చేసిందట. దీంతో కెరీర్ పరంగా కాస్తా వెనకబడ్డాను అంటూ చెప్పుకోచ్చింది. అయితే లాక్ డౌన్ విరామ సమయంలో తాను చేసిన తప్పులను సమీక్షించుకున్నానని… ఇకపై కథలు ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నానని.. భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేసింది. “24 కిస్సెస్‌’ సినిమా తర్వాత అతిథి పాత్రలు, ప్రత్యేక గీతాల్లో మాత్రమే కనిపించింది. తన కెరీర్ గురించి ఆలోచిస్తే భయమేసిందని చెప్పుకోచ్చింది. కానీ లాక్ డౌన్ లో దొరికిన విరామం వలన మంచి కథల మీద దృష్టి పెట్టాని.. ముఖ్యంగా ‘ఓదెల రైల్వేస్టేషన్‌’లో పోషిస్తున్న పల్లెటూరి అమ్మాయి పాత్ర ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపింది. ప్రస్తుతం తను కోరుకున్న పాత్రలు తనకు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేసింది.

Also Read: Sharmila : ప్రశ్నించే వాళ్లు ఉండకూడదని సంఘాలను నిర్వీర్యం చేశావ్.. తిరిగి ఒక్కటైన RTC సంఘాల పక్షాన మేముంటాం : షర్మిల

Online Shopping Cheating: ఈ కామర్స్ నిర్వాకం.. రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిస్తే.. పార్సిల్ తెరిచిన కస్టమర్ షాక్..!

Prashant Kishor: కొత్త ఫ్రంట్‌లతో బీజేపీ సర్కార్‌కు ప్రస్తుతం వచ్చే ముప్పు లేదు.. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు