
నటి హంసానందినికి బ్రెస్ట్ కాన్యర్ బారిన పడింది. నాలుగు నెలల క్రితం తెలిసిందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. రొమ్ములో గడ్డ కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని.. గ్రేడ్ 3 కేన్సర్‌గా కన్‌ఫర్మ్ అయినట్టు వెల్లడించింది. ఆపరేషన్ ద్వారా గడ్డను తొలగించారని.. హెరిడిటరీ బ్రెస్ట్ కేన్సర్ పాజిటివ్ అని రిపోర్టులు వచ్చాయని.. ఇప్పటికే 9 సైకిల్స్ కీమోథెరపీ పూర్తయ్యాయని. మరో 7 సైకిల్స్ బ్యాలన్స్ ఉన్నట్టు హంసానందిని తెలిపింది. చిరునవ్వుతో క్యాన్సర్‌ను జయించి మళ్లీ సినిమాల్లో నటిస్తానని వెల్లడించింది. అలాగే అందరికీ తన గురించి చెప్పి వారిని మరింత ఎడ్యుకేట్ చేస్తానని తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేసింది.
కాలం నా జీవితంలో ఏ విధమైన ప్రభావాలు చూపిన.. బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదు. భయం, ప్రతికూల భావాలతో జీవించను. ధైర్యంగా ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందుకు నడవాలనుకుంటున్నా.. నా తల్లి 18 సంవత్సరాల క్రితం క్యాన్సర్‌తోనే మరణించారు. అప్పటి నుంచి నేను ఆ భయంతోనే బతుకుతుననాను.. నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతి ఉన్నట్లు అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించాను. ఆ సమయంలో జరిపిన పరీక్షలలో నాకు క్యాన్సర్ గ్రేడ్ 3 ఉన్నట్లు చెప్పారు. సర్జరీ చేసి ఆ కణతిని తొలగించారు. ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పింది అనుకున్నాను.. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు లేదు.. ఇది జన్యుపరమైన క్యాన్సర్ అని వైద్యులు తెలిపారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 70 శాతం లేదా గర్భాశయ క్యాన్సర్ బయటపడే అవకాశం 40 సాతం ఉంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే సర్జరీలు ఒక్కటే దారి.. ఇప్పటివరకు 9 సైకిల్స్ కీమోథెరపీ జరిగాయి.. మరో 7 సైకిల్స్ చేయించుకోవాల్సి ఉంది. దీనితో పోరాడి.. నవ్వుతూ మీ ముందుకు వస్తాను. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాడానికే ఈ పోస్ట్ చేస్తున్న అని చెప్పుకొచ్చింది హంసానందిని.
18 ఏళ్ల క్రితం హంసానందిని తల్లి కూడా క్యాన్సర్‌తో మృతి చెందారు. ఆర్య రాజేష్ నటించిన అనుమానస్పదం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హంసానందిని. ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలక పాత్రలలో నటించి మెప్పించింది హంసానందిని. గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాలో మదనిక పాత్రలో నటించింది హంసానందిని.
No matter what life throws at me, no matter how unfair it may seem, I refuse to play the victim. I refuse to be ruled by fear, pessimism, and negativity. I refuse to quit. With courage and love, I will push forward. pic.twitter.com/GprpRWtksC
— Hamsa Nandini (@ihamsanandini) December 20, 2021
Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..