అందం, అభినయం ఎంత ఉన్న అదృష్టం మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది కొందరు హీరోయిన్లకు. ఎంత కష్టపడినా వరుసగా డిజాస్టర్స్ అందుకుంటారు. అందులో డింపుల్ హయాతి ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో ఈ అమ్మాడి గురించి అంతగా పరిచయం అవసరం లేదు. 2017లో గల్ఫ్ సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన డింపుల్.. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీలో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీకి అంతగా ఫాలోయింగ్ మాత్రం రావడం లేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి పాపులర్ అయ్యింది. తెలుగులో చివరిసారిగా ఖిలాడీ, రామబాణం సినిమాల్లో నటించింది. కానీ ఈ చిత్రాలు అంతగా విజయం కాలేదు. దీంతో మరో ప్రాజెక్ట్ ప్రకటించకుండానే సైలెంట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. డింపుల్ పక్కా తెలుగమ్మాయి. 1988 ఆగస్ట్ 21న హైదరాబాద్ లో జన్మించింది. గ్రాడ్యూయేషన్ పూర్తైన తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2017లో గల్ఫ్ సినిమా తర్వాత యురేక చిత్రంలో కనిపించింది. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర స్పెషల్ సాంగ్ చేయడంతో డింపుల్ పాపులర్ అయ్యింది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఈ బ్యూటీ సినిమాలు అంతగా మెప్పించకపోయినా.. అనుకున్నంతగా అవకాశాలు రాకపోయినా.. ఈ హీరోయిన్ చేసిన స్పెషల్ సాంగ్స్ మాత్రం ట్రెండ్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు డింపుల్ హయాతికి సంబంధించిన ఓ రేర్ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆ వీడియో చూస్తుంటే.. డింపుల్ పాత ఆడిషన్ వీడియో అని తెలుస్తోంది.
ప్రస్తుతం డింపుల్ వయసు 35 ఏళ్లు. తను 19 సంవత్సరాలు ఉన్నప్పుడే అడిషన్స్ కు పంపడానికి ఓ ప్రొఫైల్ వీడియో తీసింది. అందులో డింపుల్ పూర్తిగా సన్నగా ఉంది. ఇప్పుడు చూస్తున్న బ్యూటీకి.. అప్పటి డింపుల్ కు అసలు సంబందమే లేనట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. డింపుల్ అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉందని.. ఇప్పుడు చూస్తున్న డింపుల్ కు.. 19 ఏళ్లు బ్యూటీకి చాలా తేడా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.