
హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటుంటారు. కొన్నిసార్లు హీరోయిన్స్ కంటే హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ చేసిన ముద్దుగుమ్మలు కూడా పాపులర్ అవుతుంటారు. వారిలో ధన్య బాలకృష్ణ ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు చేసింది అలాగే సహాయక పాత్రల్లోనూ నటించి అలరించింది. రాజా రాణి సినిమాలో నయనతార ఫ్రెండ్ గా చేసింది. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సాఫ్ట్‌వేర్ సుధీర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందీ ముందుగుమ్మ. రాజుగారి గాడి సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. నటన, అందంతో ఆకట్టుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది ధన్య బాలకృష్ణ. ఇక ఇప్పుడు వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది.
ప్రస్తుతం ఈ అమ్మడు పెద్దగా కనిపించడం లేదు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాల్లో నటించిన ధన్య బాలకృష్ణ. ఎక్కువగా కోలీవుడ్ సినిమాల్లోనే కనిపించింది. చాలా కాలంగా తెలుగులో కనిపించలేదు. ఆమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అటు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ పలు వెబ్ సిరీస్ చేస్తూ అలరించింది. కానీ ఈ చిన్నది పెద్ద ఆఫర్స్ మాత్రం అందుకోలేకపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. తన సినిమా అప్డేట్స్ తో పాటు తన క్రేజీ ఫోటోలను కూడా పంచుకుంటుంది.
ఇదిలా ఉంటే గతంలో ఆమె సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్న ఆమె. ఫాలోవర్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలోపవర్ స్టార్ పవన్ కల్యాణ్, తమిళ్ హీరో సూర్య, బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ తన క్రష్‌లని.. ఛాన్స్ దొరికితే వారితో నటించాలని ఉందని తెలిపింది. మరి ఈ ముద్దుగుమ్మకు ఆ ముగ్గురు హీరోలతో కలిసి నటించే ఛాన్స్ వస్తుందేమో చూడాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ధన్య రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను కవ్విస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి