Tollywood: ఈ క్యూట్ స్మైల్​ చిన్నారి స్టార్ హీరోయిన్.. మీరు గుర్తుపట్టారా..?

ఈ క్యూట్ స్మైల్​ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్​.. బాలీవుడ్​లో జూనియర్ ఆర్టిస్ట్​గా కెరీర్ ప్రారంభించి... తెలుగు చిత్రసీమలో స్టార్‌గా ఎదిగింది. పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్​లో కూడా నటించింది. ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు తీస్తోంది. తనెవరో మీరు గుర్తుపట్టగలరా..?

Tollywood: ఈ క్యూట్ స్మైల్​ చిన్నారి స్టార్ హీరోయిన్.. మీరు గుర్తుపట్టారా..?
Heroine Childhood Picture

Updated on: Aug 22, 2025 | 2:51 PM

సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు స్టార్​ స్టాటస్​ను అందుకుని ఒక్కసారిగా కనుమరుగైపోయారు. అలాంటి వారిలో ఈమె కూడా ఒకరు. ఆకట్టుకునే అందం, అబ్బురపరిచే అభియనంతో తెలుగు చిత్రసీమలో తన మార్క్ క్రియేట్ చేసిన  ఈ హీరోయిన్..  చాలా ఎర్లీ ఏజ్‌లోనే హీరోయిన్‌గా అయిపోయింది.  తర్వాత తెలుగులోని స్టార్ హీరోలు అందరితో యాక్ట్ చేసింది. పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. ప్రస్తుతం యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చి.. చిత్ర నిర్మాణ రంగంలోకి దిగింది. హా.. ఇప్పుడు తనెవరో మీకు క్లారిటీ వచ్చి వచ్చింది. యస్ మీ గెస్ కరెక్టే..   ఆమె ఛార్మి కౌర్.

ఛార్మీ చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్​లో జూనియర్ ఆర్టిస్ట్​గా ‘ముజ్ సే దోస్తీ కరోగి’ సినిమాలో యాక్ట్ చేసింది. పదిహేనవ ఏటా తమిళ్‌తో తను చేసిన ‘కాదల్‌ అలివదిల్లయ్‌’, మలయళంలో నటించిన ‘ కట్టుచెంబాకమ్‌’ సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తెలుగునాట ‘నీతోడు కావాలి’ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఈ మూవీ సైతం హిట్ కాలేదు.

అనంతరం క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్షన్‌లో నితిన్ హీరోగా నటించిన ‘శ్రీఆంజేనేయం’ సినిమాలో గ్లామర్ పాత్రలో కనిపించి కుర్రాళ్లకు చక్కిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత అమ్మడికి పెద్ద హీరోల సరసన వరస అవకాశాలు వచ్చాయి. నాగార్జున, వెంకటేష్, నితిన్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ల సరసన ఆడిపాడింది. ఐటమ్ సాంగ్స్​తో కూడా అలరించింది. 2015 తర్వాత సిల్వర్ స్క్రీన్‌కు దూరమైన తను.. సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. నిర్మాతగా ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్​తో కలిసి సినిమాలు చేస్తోంది. అలా ఈ ఇటీవలే ఆమె సహా నిర్మాతగా వ్యవహరించిన డబుల్ ఇస్మార్ట్​ పరాజయాన్ని అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి