Chandini Chowdary: ఇంత దారుణమా? సినిమా రిలీజ్ కు ముందు షాకింగ్ వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్

కలర్ ఫొటోతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది చాందినీ చౌదరి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా శుక్రవారం (నవంబర్ 14) న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు చాందినీ షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Chandini Chowdary: ఇంత దారుణమా? సినిమా రిలీజ్ కు ముందు షాకింగ్ వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్
Chandini Chowdary

Updated on: Nov 13, 2025 | 9:37 PM

టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ అందాల తార ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కలర్ ఫొటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తి అనే సినిమాతో మన ముందుకు రానుంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 14)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటోంది చాందినీ. అయితే మరికొన్ని గంటల్లో తన సినిమా రిలీజ్ కానుండగా ఒక షాకింగ్ వీడియోను షేర్ చేసిందీ అందాల తార. ఇందులో ఒక కార్ షో రూం ముందు కొందరు వీధి కుక్కలను పట్టుకుని తీసుకువెళుతున్నారు. అయితే ట్రాలీలో ఎక్కిస్తున్న క్రమంలో కుక్కలను కింద నుంచి పైకి విసురుతున్నారు. అందులో ఒక కుక్క ప్రమాదవశాత్తూ పై నుంచి కింద పడిపోతుంది. అంతటితో ఆగకుండా బ్రతికి ఉన్న ఆ కుక్కను ఓ వస్తువులా ట్రీట్ చేస్తూ నిర్లక్ష్యంగా దాన్ని పైకి విసిరారు. ఈ వీడియోని షేర్ చేసిన చాందిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

’నోరు లేని మూగ జీవాల పట్ల ఇంతటి అమానుషమా? అవి కూడా మనలాగే ప్రాణులనే విషయాన్ని కూడా మరిచిపోయారు. వాటిని అలా విసరడం ఎంత ఘోరం? వాటికి హాని కలుగుతుందనే కనీసం ఆలోచన కూడా లేకుండా విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం జంతువుల పట్ల జాలి, దయ లేని సమాజంలో మనం జీవిస్తున్నాం’ అంటూ తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది చాందినీ చౌదరి.

ఇవి కూడా చదవండి

చాందినీ చౌదరి షేర్ చేసిన వీడియో ఇదే..

ఈ సంఘటన విశాఖపట్నంలోని వరుణ్ మోటార్ ముందు జరిగినట్టు వెల్లడించింది చాందినీ చౌదరి. విశాఖపట్నం మున్సిపాలిటి అధికారులను దీన్ని కాస్తా గమనించి చర్యలు తీసుకోవాలని హీరోయిన్ కోరింది. ప్రస్తుతం చాందినీ చౌదరి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

సంతాన ప్రాప్తిరస్తు సినిమా ప్రమోషన్లలో చాందినీ చౌదరి.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.