Pushpa 2: పుష్పలో ఆ హీరోయిన్.. నెగిటివ్ పాత్ర కోసం ఈ అమ్మడిని కూడా తీసుకున్నారా.?

|

Nov 22, 2022 | 10:32 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపంతో మెప్పించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు

Pushpa 2: పుష్పలో ఆ హీరోయిన్.. నెగిటివ్ పాత్ర కోసం ఈ అమ్మడిని కూడా తీసుకున్నారా.?
Pushpa 2
Follow us on

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. పాన్ ఇండియా మూవీగా వచ్చిన పుష్ప సినిమా అన్ని రికార్డులను తిరగరాసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపంతో మెప్పించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఊర మాస్ గెటప్ లో బన్నీ నటన, బడీ లాంగ్వేజ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సుకుమార్ మేకింగ్, బన్నీ యాక్టింగ్ పుష్ప సినిమాను యూ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. ఇక ఈ  సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబట్టింది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ముందుగానే పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తామని చెప్పిన సుకుమార్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.

మొదటి పార్ట్ కు మించి సెకండ్ పార్ట్ లో ట్విస్ట్ లు, యాక్షన్స్ సీన్స్ ఉండనున్నాయట. పుష్ప సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక సెకండ్ పార్ట్ లో మరికొంతమంది కూడా యాడ్ అవ్వనున్నారట. అయితే ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో మరో లేడీ విలన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. మొదటి పార్ట్ లో అనసూయ నెగిటివ్ పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కేథరిన్‌ను తీసుకున్నారు అంటున్నారు.ఆ పాత్ర పాజిటివ్‌గా కనిపించి, ఆఖరున బన్నీకి షాక్‌ ఇచ్చేలా ఉంటుందని టాక్‌. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Catherine Tresa