నాకు సరైన సపోర్ట్ లభించలేదు.. బోల్డ్ సన్నివేశాలపై నటి క్రేజీ కామెంట్స్

నటి అర్చనా శాస్త్రి ఓఇంటర్వ్యూలో బోల్డ్ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు ఎదురయ్యే అనుభవాలను, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తనకు లభించిన మద్దతు గురించి తన మనసులోని మాటలను పంచుకున్నారు. కమలతో నా ప్రయాణం చిత్రంలో ప్రాస్టిట్యూట్ పాత్రలో నటించినప్పుడు ఎదురైన సవాళ్లు పంచుకున్నారు.

నాకు సరైన సపోర్ట్ లభించలేదు.. బోల్డ్ సన్నివేశాలపై నటి క్రేజీ కామెంట్స్
Actress Veda

Updated on: Jun 06, 2026 | 7:22 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి అర్చనా శాస్త్రి అలియాస్ వేద. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రామదాసు సినిమాలో సీతగా నటించి ఆకట్టుకుంది అర్చన, చాలా కాలంగా ఆమె సినిమాల్లో నటించడం లేదు.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. కాగా గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, ముఖ్యంగా బోల్డ్ సీన్స్ చిత్రీకరణ, కమలతో నా ప్రయాణం చిత్రం అనుభవాలు, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తనకు లభించని మద్దతుపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. అర్చనా శాస్త్రి బోల్డ్ సన్నివేశాలపై తన వృత్తిపరమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు అని ఆమె అన్నారు. కమలతో నా ప్రయాణం సినిమాలో చేసిన బోల్డ్ సన్నివేశాలను ప్రస్తావిస్తూ.. అంతమంది పబ్లిక్ మధ్య చీర తీయడమే ఒక డిస్కంఫర్ట్ అని, అవి కష్టమైన సీన్సే అని ఒప్పుకున్నారు.

అయితే నటనపై తమకున్న అంకితభావంతో, సహనటుడు శివాజీతో కలిసి సన్నివేశాలను ముందే రూపొందించుకుని, ఒకే టేక్‌లో పూర్తి చేశామని ఆమె తెలిపారు. ఈ సన్నివేశాలలో వల్గారిటీ లేకుండా, పాత్రకు అవసరమైన బోల్డ్‌నెస్‌ను మాత్రమే ప్రదర్శించేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. శివాజీ ఎంతో సహకరించారని, జోకులతో వాతావరణాన్ని తేలికపరిచేవారని గుర్తు చేసుకున్నారు. అర్చనా శాస్త్రి కెరీర్‌లో కమలతో నా ప్రయాణం చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రాస్టిట్యూట్ పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

అలాగే ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి నేను గర్వంగా చెప్పుకుంటాను అని అన్నారు. అయితే, ఈ అద్భుతమైన చిత్రం తగిన రీతిలో ప్రేక్షకులను చేరుకోలేకపోయింది. ఒక వారం, రెండు వారాల పాటు మంచి టాక్ వచ్చినా, థియేటర్లలో కొనసాగించలేకపోయారని, నిర్మాతలు, ల్యాబ్ మధ్య కొన్ని సమస్యల కారణంగా సినిమా ఆన్‌లైన్‌లో గానీ, విడుదల కాలేదని అర్చనా శాస్త్రి విచారం వ్యక్తం చేశారు. ఎంతో మంచి సినిమా ఇలా అవ్వడం బాధాకరం అని ఆమె అన్నారు. తనను తెలుగు చిత్ర పరిశ్రమ “మన అమ్మాయి” అని అభిమానంగా పిలిచినా, పూర్తి స్థాయిలో ఆదరించలేదని అర్చనా శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. కమలతో నా ప్రయాణం ప్రమోషన్ల సమయంలో పరిశ్రమలోని పెద్దల మద్దతు లభించకపోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. కంగనా రనౌత్, సన్నీలియోన్ వంటి నటీమణులకు పరిశ్రమ మద్దతు లభించిన తీరును ప్రస్తావిస్తూ, తెలుగు అమ్మాయిగా తన విషయంలో అది జరగలేదని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us