అయ్యో పాపం..! పబ్లిసిటీ స్టంట్ కాదు నిజంగానే తగిలింది.. కుట్లు కూడా పడ్డాయి..

|

Mar 25, 2025 | 12:30 PM

చాలా మంది నటీనటులు షూటింగ్స్ లోనో, లేదా ఇంట్లోనో గాయపడుతూ ఉంటారు. తాజాగా ఓ నటి తలకు గాయం అయ్యింది. అయితే తనకు గాయం అవ్వలేదు అని పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసి క్లారిటీ ఇచ్చింది ఆ హీరోయిన్. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

అయ్యో పాపం..! పబ్లిసిటీ స్టంట్ కాదు నిజంగానే తగిలింది.. కుట్లు కూడా పడ్డాయి..
Actress
Follow us on

చాలా మంది హీరోయిన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రలు విలన్ పాత్రలు చేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఆతర్వాత కనిపించకుండా మాయం అయ్యారు. ఆతర్వాత ఇప్పుడు సెకండ్  ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న భామ ఒకరు. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రీసెంట్ గా ఆమె తలకు బ్యాండేజ్ తో కనిపించింది. తనకు గాయం అయ్యిందని తెలిపింది. అయితే కొంతమంది అది పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్స్ చేశారు. అలాంటి వారికి క్లారిటీ ఇచ్చింది ఆ నటి. ఇంతకూ ఆమె ఎవరు.? గాయం ఎలా అయ్యిందంటే..

ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది

పైన కనిపిస్తున్న నటి ఎవరో కాదు అన్షు. మన్మథుడు సినిమాలో అన్షు, నాగార్జునతో కలిసి నటించింది ఈ భామ. ఇది ఆమె మొదటి తెలుగు సినిమా. మన్మథుడు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిన బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ. “గుండెల్లో ఏముందో” అనే పాటలో ఆమె అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలోకనిపించింది. అన్షు తెలుగు సినిమాల్లో ఎక్కువ కాలం పనిచేయలేదు. “రాఘవేంద్ర” తర్వాత ఆమె వివాహం చేసుకుని సినిమా రంగం నుండి దూరమైంది. లండన్‌లో స్థిరపడిన ఆమె, ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్‌లోకి మారి “ఇన్‌స్పిరేషన్ కౌచర్” అనే బట్టల బ్రాండ్‌ను నడుపుతోంది. “మజాకా”తో ఆమె తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే

దాదాపు 22 ఏళ్లతర్వాత తిరిగి తెలుగు ప్రేక్షకులను పలకరించింది అన్షు. ఇక ఈ భామ తలకు గాయం అయిన విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఈమేరకు ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. అన్షునే ఓ వీడియోని షేర్ చేస్తూ అసలు విషయాన్ని చెప్పింది. అది పబ్లిసిటీ స్టంట్ కాదని, నిజంగానే గాయం అయిందని తెలిపింది. అలాగే కుట్లు కూడా పడ్డాయి అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.