Viral Photo: ఆ కళ్లు కవ్విస్తాయి.. భావాలను చెప్తాయి.. ప్రేమను నేర్పిస్తాయి.. ఈ అందాల రాశి ఎవరో గుర్తుపట్టండి ?

బొద్దుగా ఉండే ఈ చిన్నది.. ఈ మధ్య మరింత నాజుగ్గా మారి వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది.

Viral Photo: ఆ కళ్లు కవ్విస్తాయి.. భావాలను చెప్తాయి.. ప్రేమను నేర్పిస్తాయి.. ఈ అందాల రాశి ఎవరో గుర్తుపట్టండి ?
Actress

Edited By:

Updated on: Jun 13, 2022 | 8:32 PM

సినీ పరిశ్రమలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కథానాయికగా అలరించింది. ప్రతి పాత్రలోనూ అద్భుతమైన నటన కనబరించింది.. బొద్దుగా ఉండే ఈ చిన్నది.. ఈ మధ్య మరింత నాజుగ్గా మారి వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. కేవలం హీరోయిన్‏గా మెయిన్ రోల్స్ మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ చరణ్ సినిమాలో నటిస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి ?.. మీకోసం చిన్న క్లూ.. ఈ కలువ కళ్ల చిన్నది మన తెలుగమ్మాయి.. గుర్తుపట్టేయండి..

పైన ఫోటోలో కలువ కళ్లతో మాయ చేస్తున్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. అచ్చ తెలుగు అందం అంజలి.. షాపింగ్ మాల్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేసింది.. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, వకీల్ సాబ్ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా డైరెక్టర్ అనిల్ రావిపూడి .. బాలయ్య కాంబోలో రాబోతున్న సినిమాలో ప్రతినాయకురాలి పాత్రలో నటించనుందని టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంటుంది అంజలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us