
మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ అనన్య నాగళ్ల. ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించి మెప్పించింది అనన్య. మల్లేశం సినిమాలో అనన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత ప్లే బ్యాక్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది అనన్య. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించింది అనన్య. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు అనన్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది.
ప్రస్తుతం ఈ చిన్నది పొట్టేలు, తంత్ర సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్నీ పంచుకుంది. చాలా మంది హీరోయిన్స్ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి సర్జరీ చేయించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ రకరకాల సర్జరీలు చేయించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనన్యకు ఇదే ప్రశ్న ఎదురైంది.
మీరు అందంగా కనిపించడం కోసం ఏదైనా సర్జరీ చేయించుకున్నారా..? అన్న ప్రశ్నకు అనన్య బదులిస్తూ.. అవును నేను సర్జరీ చేయించుకున్నా.. నా పెదవులకు చికిత్స చేయించుకున్నా..లిప్ షేప్ కోసం నేను లిప్ ఫిల్లర్ వేయించాను. అది చేయించుకొని దాదాపు రెండేళ్లు దాటిపోయింది ఇప్పుడు అది పోయింది అని తెలిపింది అనన్య. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనన్య. ఇక ఈ చిన్నది నటించిన తంత్ర సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చ్ 15న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.