Suresh Gopi: కేంద్ర మంత్రి సురేశ్ గోపికి షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణం ఇదే

|

Nov 04, 2024 | 8:11 AM

కేంద్రమంత్రి సురేష్‌గోపి చిక్కుల్లో పడ్డారు. అంబులెన్స్‌లో ఉత్సవాలకు హాజరయ్యారనే ఫిర్యాదుతో కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. సీబీఐతో ఎంక్వైరీ చేయాలని సురేష్‌గోపి డిమాండ్‌ చేయడం ఆసక్తిగా మారింది.

Suresh Gopi: కేంద్ర మంత్రి సురేశ్ గోపికి షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణం ఇదే
Suresh Gopi
Follow us on

కేంద్ర మంత్రి సురేశ్ గోపికి షాక్ తగిలింది. అంబులెన్స్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఆయనతో పాటు మరో ఇద్దరిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. గత ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో త్రిసూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేశ్‌ గోపి, కొందరు వ్యక్తులతో కలిసి ఎన్నికల ప్రచార వ్యూహంలో భాగంగా సేవాభారతి అంబులెన్స్‌లో ప్రయాణించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. అలాగే.. కేరళలో ప్రసిద్ధి చెందిన త్రిశూర్ పూరం ఉత్సవానికి సైతం అంబులెన్స్‌లోనే వెళ్లారనే ఆరోపణలు వచ్చాయి.

ఉత్సవానికి అంతరాయం కలిగించి.. సురేష్ గోపిని అంబులెన్స్‌లో తీసుకువచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సురేశ్‌గోపీ తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రతిపక్ష నేతలు. పోలీసులు ఆంక్షలను ఉల్లంఘించారని, పేషెంట్ల కోసం ఉపయోగించాల్సిన అంబులెన్స్ సర్వీసును దుర్వినియోగం చేశారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దాంతో.. సురేష్ గోపీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సురేశ్‌గోపీతోపాటు.. మరో ఇద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక.. కేసు నమోదు కావడంతోపాటు.. ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి సురేష్ గోపీ ఖండించారు. తన కారులోనే ఉత్సవ వేదిక సమీపంలోకి చేరుకున్నానని.. అయితే.. ఆ సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన కొందరు గూండాలు దాడి చేశారని చెప్పారు. అక్కడున్న కొందరు యువకులు తనను రక్షించి ఉత్సవ స్థలంలోని అంబులెన్స్‌లో కూర్చోబెట్టారని తెలిపారు. ఈ వ్యవహారంపై కేరళ పోలీసులతో కాకుండా సీబీఐ విచారణ జరిపించాలని సురేష్‌గోపీ డిమాండ్ చేయడం ఆసక్తి రేపుతోంది.