Vijay Devarakonda: స్పీడ్ పెంచిన దేవరకొండ.. మరో డైరెక్టర్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ ?..

|

May 26, 2022 | 8:06 AM

ఇప్పుడు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి

Vijay Devarakonda: స్పీడ్ పెంచిన దేవరకొండ.. మరో డైరెక్టర్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ ?..
Vijay Devarakonda
Follow us on

స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని కంప్లీట్ చేసిన ఈ హీరో.. ఇప్పుడు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. ఇటీవలే కశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూ్ల్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలోనే హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమానే కాకుండా.. మళ్లీ పూరి దర్శకత్వంలో జనగనమణ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ క్రమంలో తాజాగా హీరో విజయ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలన్ని షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ ఇంద్రగంటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.. త్వరలోనే వీరిద్దరి సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కించే చాన్స్ ఉందని.. ఇందులో నటించే హీరోయిన్.. నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్.. సుధీర్ బాబుతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సుధీర్ కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత విజయ్, ఇంద్రగంటి సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.