
గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్ లు ఎదుర్కొన్న హీరో సూర్యకు ‘కరుప్పు’ ‘తెలుగులో వీర భద్రుడు) సినిమా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమా సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ సక్సెస్ ను కొనసాగించేందుకు మరో డిఫరెంట్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు సూర్య. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో అతను నటించిన లేటెస్ట్ సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. లేటెస్ట్ సెన్సేషన్ మమితా బైజు కథానాయికగా చేస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. హీరో, హీరోయిన్లతో పాటు చిత్ర బృందమంతా ఈ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ సీనియర్ హీరోయిన్ రాధిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాధిక తమ కుటుంబానికి ఆపత్కాలంలో ఆర్థిక సాయం చేసిందని, ఆమెని ఎప్పటికీ మర్చిపోలేం అని ఎమోషనల్ అయ్యాడు
‘కార్తీ.. అమెరికాలో చదివేందుకు వెళ్లాల్సిన టైంలో వీసా ప్రక్రియలో భాగంగా బ్యాంక్ అకౌంట్‌లో సరిపడా డబ్బులు ఉండాలి. అప్పట్లో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు. ఈ విషయం తెలుసుకున్న రాధిక అక్క.. మరో ఆలోచన లేకుండా అవసరమైన డబ్బును ఇచ్చింది. కార్తీకి కాలేజీలో అడ్మిషన్ వచ్చే వరకు ఈ డబ్బులు అకౌంట్‌లో ఉంచుకోమని చెప్పింది. ఆమె చేసిన సాయాన్ని మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం’ అని సూర్య చెప్పుకొచ్చాడు.
కాగా అమెరికాలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసిన కార్తీ.. చెన్నైకి తిరిగి వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పలు సినిమాలకు సహాయక దర్శకుడిగా చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పోతే సూర్య, కార్తీలకు రాధికతో మంచి అనుబంధం ఉంది. అందుకే ఈ హీరోలిద్దరూ చేసిన చాలా సినిమాల్లో రాధిక కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి రాధిక గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు సూర్య.
సీనియర్ నటి రాధికతో సూర్య ఫ్యామిలీ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.