‘చిరంజీవిని ఫాలో అయిపోండి.. హిట్ కొడతారని మేనేజర్ అన్నాడు.. వెంటనే పని నుంచి తీసేశా’

సీనియర్ నటుడు సురేష్ తన మేనేజర్‌ను ఎందుకు తొలగించాడో వివరించారు. చిరంజీవితో పోల్చుకోమని చెప్పినందుకు తాను ఆ నిర్ణయం తీసుకున్నానని, తనకు నిరంతర అభ్యాసం, స్వయం సమృద్ధి ముఖ్యమని తెలిపారు. ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు కోసం ప్రయత్నించానని పేర్కొన్నారు.

చిరంజీవిని ఫాలో అయిపోండి.. హిట్ కొడతారని మేనేజర్ అన్నాడు.. వెంటనే పని నుంచి తీసేశా

Updated on: Jan 28, 2026 | 3:30 PM

సీనియర్ నటుడు సురేష్ తన సినీ కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసిన అనేక అంశాలను ఓ ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. ఆయన సినీఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పుడు కార్తీక్, ప్రభు లాంటి లెజెండ్ల కొడుకులు అప్పటికే స్టార్లుగా ఉన్నారని.. వారికి ముందుగానే ఒక బలమైన పునాది ఉందని గుర్తు చేసుకున్నారు. తెలుగులోనూ నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి స్టార్ల వారసులతో తనకు పోటీ ఎదురైందని, అయినప్పటికీ తాను వారితో పోల్చుకోవడమో లేదా వారిని బీట్ చేయాలనో ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశారు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడానికే ప్రయత్నించానని తెలిపారు.

ఇది చదవండి: హీరోయిన్లు అందరూ శోభన్ ‌బాబు దగ్గరకు వెళ్లి ఏం మాట్లాడేవారంటే.? అసలు విషయాన్ని చెప్పిన జయసుధ

ఈ క్రమంలో తన మేనేజర్‌తో జరిగిన ఒక సంఘటనను సురేష్ వివరించారు. చిరంజీవి ఈ సినిమాలో ఈ జాకెట్‌ వేశారు. కాబట్టి మనం ఆ జాకెట్‌ వేయాలి, ఆయన డాన్స్ మాస్టర్‌ను పెట్టుకోవాలి, ఆయన టీమ్‌ను పెట్టుకుని హిట్ ఇవ్వాలి అని మేనేజర్ సలహా ఇవ్వగా, వెంటనే అతడిని పనిలో నుంచి తొలగించినట్లు సురేష్ వెల్లడించారు. అలాంటి ఆలోచనలు తనకు ఆమోదయోగ్యం కావని, చిరంజీవి చిరంజీవే అని.. తాను సురేష్‌నని స్పష్టం చేశారు. “ఆయన కాశ్మీర్‌ వెళ్ళాడని చెప్పి, ప్రొడ్యూసర్‌లు నన్ను కాశ్మీర్‌కు తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఉదయగిరిలో షూటింగ్ చేసుకుంటే చాలు. దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్‌గా చేయాలని ఆలోచిద్దాం, వారం రోజులు సిట్టింగ్ వేద్దాం” అని తన దృక్పథాన్ని వివరించారు.

సురేష్ తన వ్యక్తిగత ఫిలాసఫీలను కూడా పంచుకున్నారు. జపనీస్ కైజెన్ ఫిలాసఫీ(కాన్‌స్టెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్‌మెంట్) తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. ఏదైనా ఒక వస్తువును ఎలా చూసుకున్నామో, అలాగే తిరిగి వదలడం బాధ్యత అని ఆయన నమ్ముతారు. ఉదాహరణకు, ఒక హోటల్ టేబుల్‌ను తాను కూర్చునే ముందు ఎంత నీట్‌గా ఉందో, తినిన తర్వాత కూడా అంతే నీట్‌గా వదిలి వెళ్తానని తెలిపారు. అలాగే, పేపర్ న్యాప్కిన్‌లను వృథా చేయకుండా, ఒకే న్యాప్కిన్‌ను వీలైనంత వరకు రోజు మొత్తం వాడటానికి ప్రయత్నిస్తానని, “వృక్షో రక్షతి రక్షితః” అనే సూత్రాన్ని పాటిస్తానని పేర్కొన్నారు. ఈ అలవాట్లు కొందరికి “తిమిరు జాస్తి” (అహంకారం ఎక్కువ) అనిపించవచ్చని, కానీ తాను నిజాయతీగా ఉంటానని అన్నారు. సినిమాలు లేనప్పుడు ఖాళీగా కూర్చోకుండా, తాను నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటానని సురేష్ పేర్కొన్నారు. C, C++, Java, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ వంటి ప్రోగ్రామింగ్ భాషలు నేర్చుకుని సర్టిఫికేట్లు సంపాదించానని, ఆ తర్వాత లాంగ్ డిస్టెన్స్‌లో B.Com, M.Com, MBA పూర్తి చేశానని తెలిపారు. “జీవితం అంటే నిరంతర అభ్యాస ప్రక్రియ” అని ఆయన గట్టిగా నమ్ముతారట.

ఇది చదవండి: ‘తాగేసి షూటింగ్‌కి వచ్చానని.. ఎన్టీఆర్ మా ఫైటర్స్‌ను పిలిచి ఏం చేశాడంటే..’

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..