Actor Suhas: వంద రూపాయాల నుంచి 3 కోట్ల రెమ్యునరేషన్.. హీరో సుహాస్ ఏమన్నారంటే..

కొన్నాళ్ల క్రితం రైటర్ పద్మభూషణ్ సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు . ఇటీవలే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో అలరించింది.. ఇప్పుడు 'ప్రసన్న వదనం' మూవీతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Actor Suhas: వంద రూపాయాల నుంచి 3 కోట్ల రెమ్యునరేషన్.. హీరో సుహాస్ ఏమన్నారంటే..
Suhas

Updated on: Mar 07, 2024 | 3:53 PM

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు కోసం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు సుహాస్. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఇప్పుడు హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇప్పుడు వెండితెరపై హీరోగా అలరిస్తున్నారు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చూస్తు సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు సుహాస్. కొన్నాళ్ల క్రితం రైటర్ పద్మభూషణ్ సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు . ఇటీవలే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో అలరించింది.. ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ మూవీతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ప్రసన్న వదనం టీజర్ రిలీజ్ ఈవెంట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు సుహాస్. ఈ క్రమంలో తన రెమ్యునరేషన్ గురించి వస్తున్న వార్తలపై రియాక్ట్ అయ్యారు. వరుస సినిమాలు చేస్తున్నారు.. దీంతో మూడు వేల నుంచి మూడు కోట్ల రూపాయాలకు రెమ్యునరేషన్ పెంచారని అంటున్నారు. నిజమేనా ? అని అడగ్గా… సుహాస్ రియాక్ట్ అవుతూ.. “నేను బతకాలి కదా.. జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. అప్పట్లో రోజుకు వంద రూపాయాలు తీసుకున్నాను. అప్పటికీ ఇప్పటికీ మార్పు రావాలి కదా.. కానీ మీరు అనుకుంటున్నంత మార్పు అయితే కాదులెండి.. అంత పారితోషికం తీసుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుహాస్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇక నుంచి సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తానని.. తన సినిమాలు చూసి ప్రేక్షకులెవరూ తనను తిట్టుకోరనే నమ్మకం ఉందని.. అలాంటి చిత్రాలనే ఎంచుకుంటానని అన్నారు. ప్రసన్న వదనం సినిమాకు అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే అతడు డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, వైవా హర్ష, నితిన్ ప్రసన్న కీలకపాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ఉన్నట్లు తెలుస్తోంది.