Sree Vishnu: రాజ రాజ చోర ప్రీరిలీజ్ ఈవెంట్‏లో సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో శ్రీవిష్ణు.. రాసి పెట్టుకొండి అంటూ..

|

Aug 16, 2021 | 8:04 AM

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాజా రాజా చోర. కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న

Sree Vishnu: రాజ రాజ చోర ప్రీరిలీజ్ ఈవెంట్‏లో సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో శ్రీవిష్ణు.. రాసి పెట్టుకొండి అంటూ..
Sree Vishnu
Follow us on

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాజా రాజా చోర. కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా నటిస్తుండగా.. బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ కీలక పాత్రలో నటిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో వేడుకలో హీరో శ్రీవిష్ణు సంచల వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల చిన్న హీరోలు తమ సినిమాలపై ధీమా వ్యక్తం చేస్తూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‏లలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్… తమ సినిమా సూపర్ హిట్ అవుతుందని.. హిట్టు కాకపోతే పేరు మార్చుకుంటా.. అని కొందరిని తన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకకు పిలవడం తనకు ఇష్టముండదు అని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో శ్రీవిష్ణు కూడా అలాంటి కామెంట్లే చేశారు. రాజ రాజ చోర సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గోన్న శ్రీవిష్ణు దాదాపు పావుగంట మాట్లాడరు. ఈ సినిమాను మూడు భాషల్లో రిమేక్ చేస్తారని.. కచ్చితంగా అన్ని ఇండస్ట్రీ వాళ్లు ఈ మూవీ గురించి మాట్లాడుతారని ధీమ వ్యక్తం చేశారు. ఈ సినిమా తెలుగు చిత్రం అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుందని.. ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆరు మాస్కులతో వెళ్లాలని.. నవ్వి నవ్వి ఫస్ట్ హాఫ్‏లో మూడు మాస్కులు ఎగిరిపోతాయని అన్నారు.

ఇక సెకండ్ హాఫ్‏లో కచ్చితంగా మీకు తడిచిపోతుంది. అలా మూడు మాస్కులు సెకండ్ హాఫ్‏లో తడవకపోతే నాకు చెప్పండి.. ఎంతలా నవ్విస్తామో అంతగా ఎడిపిస్తామని చెప్పుకొచ్చారు. రాసి పెట్టుకొండి ఈ సినిమాను అన్ని భాషల వారు రీమేక్ కోసం అడుగుతారు. ఈ సినిమా పగిలిపోయింది. ఏ మూవీకైనా.. ఇంటర్వెల్ దాదాపు 5 లేదా 10 నిమిషాలు ఉంటుంది. కానీ ఈ సినిమాకు దాదాపు అర్ధగంట ఉంటుందని అన్నారు. ఆగస్ట్ 19న థియేటర్లలోకి రాబోతున్నాం. మా లాంటి చిన్న సినిమలకు ఎంకరేజ్ చేస్తేనే పెద్ద సినిమాలు కూడా లైన్లోకి వస్తాయని అన్నారు.

Also Read: Mandira Bedi: మరచిపోవడానికి అతను జ్ఞాపకం కాదు.. జీవితమే తను.. భర్త పై భావోద్వేగ పోస్ట్ చేసిన సాహో బ్యూటీ..

Ram Charan: జాతీయ జెండాకు అవమానం.. చెర్రీని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ ఎం జరిగిందంటే ?