Amaran: ఫేస్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ.. అమరన్ ట్రైలర్ వచ్చేసింది..

|

Oct 24, 2024 | 6:10 AM

దివంగత ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అమరన్ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

Amaran: ఫేస్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ..  అమరన్ ట్రైలర్ వచ్చేసింది..
Amaran
Follow us on

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. రొటీన్ కథలు కాకుండా వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తుంటారు శివకార్తికేయన్. ఇక శివకార్తికేయన్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాకోసం ఎదురుచూసే అభిమానులు తెలుగులోనూ ఉన్నారు. రెమో, డాన్, వరుణ్ డాక్టర్ ఇలా శివ సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి.ఇక తెలుగు దర్శకుడు అనుదీప్‌తో ప్రిన్స్ అనే సినిమా కూడా చేశారు శివ కార్తికేయన్. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. అమరన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శివకార్తికేయన్.

ఇది కూడా చదవండి : Actress : రెండు పెళ్లిళ్లు, ఇద్దరు పిల్లలు.. రెండుసార్లు విడాకులు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో, శివకార్తికేయన్, సాయి పల్లవి, సురేష్ చక్రవర్తి, శ్రీకుమార్, రాహుల్ బోస్, భువన్ అరోరా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం అమరన్. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్నియూనివర్సల్ హీరో కమల్ హాసన్, రాజ్‌కమల్ ఫిల్మ్స్ , సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దివంగత ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇది కూడా చదవండి :దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే

అమరన్ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కు అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాగా కొద్ది రోజుల క్రితం అమరన్ సినిమా మ్యూజిక్ రిలీజ్ వేడుక చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చాలా ఘనంగా జరిగింది. ఈ చిత్రం అభిమానులకు తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. ఇక ఇప్పుడు అమరన్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో టోవినో థామస్, తెలుగులో నాని, కన్నడలో శివరాజ్‌కుమార్, హిందీలో అమీర్ ఖాన్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ సినిమాలో శివకార్తికేయన్, సాయి పల్లవి అద్భుతంగా నటించారు.

ఇది కూడా చదవండి : Tollywood: అందంలో అమ్మనే మించిపోయిందిగా..! కేసీఆర్ మూవీ హీరోయిన్ ఆ టాలీవుడ్ నటి కూతురా..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.