Siva Reddy: అప్పట్లో 2 ఎకరాలు 11 లక్షలు.. ఇప్పుడు రూ. 100 కోట్లు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి నవ్వించిన శివారెడ్డి ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. అతను సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులే అయ్యింది. అయితే అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నారు శివా రెడ్డి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి విషయాలను పంచుకుంటున్నాడు.

మిమిక్రీ ఆర్టిస్టుగా, నటుడిగా, హోస్ట్ గా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు శివారెడ్డి. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన అతను దేశ విదేశాల్లో 6000 కి పైగా అనేక ప్రదర్శనలిచ్చాడు. ఇక 1996లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓవరాల్ గా 100 కు పైగా సినిమాల్లో నటించాడు. సినీ నిర్మాత సానా యాదిరెడ్డి పరిచయంతో మొదటి సారిగా పిట్టల దొర సినిమాలో నటించాడు శివారెడ్డి. తర్వాత బ్యాచిలర్స్, అమ్మాయి కోసం, ఆనందం, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, మనసంతా నువ్వే, స్టాలిన్, అతడే ఒక సైన్యం, వసంతం, నాగ, నేనున్నాను, నమో వెంకటేశ, దూకుడు తదితర చిత్రాల్లో నటిం మెప్పించాడు శివారెడ్డి. ఎక్కువగా స్నేహితుడి ఫ్రెండ్ పాత్రల్లో కనిపించి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడీ కమెడియన్. అయితే 2011 తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు శివారెడ్డి. అప్పుడప్పుడు మాత్రమే వెండితెరపై కనిపించేవాడు. అయితే అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నారీ స్టార్ నటుడు. ఈ క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ వర్క్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే సందర్భంగా కొందరి స్నేహితుల వల్ల తాను బాగా మోసపోయానంటూ బాగా ఎమోషనల్ అయ్యారు శివారెడ్డి. ‘నేను ఎంతో నమ్మిన ఒక స్నేహితుడు 70 లక్షల రూపాయల డబ్బును తీసుకువెళ్లి తిరిగి ఇవ్వకుండా తీవ్రంగా మోసం చేశాడు. దీంతో నేను ఆర్థికంగా చాలా నష్టపోయాను. ఒకవేళ ఆ రోజు ఆ వ్యక్తి నా డబ్బును మోసం చేయకుండా ఉంటే, నేను ఇవాళ ఇలా ఉండే వాడిని కాదు. అతను ఎప్పుడూ నా దగ్గరే ఉండే వాడు’
‘నేను ఏదైనా స్థలం కొనాలనుకుంటే… ‘అది బాలేదు, ఇది బాలేదు’ అంటూ నన్ను కొనకుండా చేసేవాడు. పైగా అతని తండ్రి కూడా వచ్చి… ‘వద్దు’ అని మరింత గట్టిగా, నమ్మకంగా చెప్పేవాడు. మన మంచి కోసమే చెబుతున్నారేమో అని నేను అనుకునేవాడిని. అలా అప్పట్లో నేను వదిలేసిన స్థలాలు ఇప్పుడు 50 కోట్లకు పైగా ధర పలుకుతున్నాయి. ముఖ్యంగా ఒకసారి మణికొండ ప్రాంతంలో రెండు ఎకరాలు తీసుకుందామనుకున్నాను. ఆ రెండు ఎకరాల భూమి కేవలం 11 లక్షల రూపాయలకే ఇస్తామన్నారు. కానీ ఆ సమయంలో జరిగిన మోసాల వల్ల నేను ఆ భూమిని కొనుగోలు చేయలేకపోయాను. ఒకవేళ ఆ రోజు నేను ఆ మణికొండ భూమిని కొని ఉంటే నేను ఇప్పుడు ఎంతో మంచి స్థాయిలో ఉండేవాడిని. ఆ స్థలంలో కనీసం ఒక 10 లేదా 20 విల్లాలు వచ్చినా కూడా, నేడు ఒక్కో విల్లా విలువ కోట్ల రూపాయలు ఉండేవి. నా ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా చేరి ఉండేది. ఇక మాదాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న సుమారు 450 గజాల మంచి ప్రాపర్టీ కోసం తాను 35 లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లించాను. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ వంటి పేపర్లు అడిగినప్పుడు, ఆ వ్యక్తి మొదట ఇస్తానని చెప్పి ఆ తర్వాత రకరకాలుగా కాలయాపన చేశాడు. దీంతో విసిగిపోయి నా డబ్బులు వెనక్కు తీసుకున్నాను. ఇది కూడా తన స్నేహితుడు చెప్పడం వల్లే జరిగింది. కొద్దిగా ఓపికగా ఉంటే ఆ ప్లేస్ నా సొంతమయ్యేది. అయితే కొన్ని రోజులకు స్వయంగా ఆ వ్యక్తి నన్ను మళ్లీ ఇంటికి ఆహ్వానించాడు. అతని కుటుంబ సభ్యులంతా నాకు అభిమానులమని చెప్పి నేను ఇచ్చిన అసలు మొత్తాన్ని నాకు ఇచ్చేశాడు. ఇలా కొందరు స్నేహితుల వల్ల నేను భారీగా నష్టపోయాను. అయితే ఇలాంటి అనుభవాలు నాకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పించాయి’అని శివారెడ్డి చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




