AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫుల్లుగా విటమిన్ సి, మినరల్స్.. 100ల సమస్యలకు సహజ ఔషధం ఈ పండు..

బత్తాయిపండులో విటమిన్‌ సి, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. బత్తాయిని పండుగా లేదా రసంగా తీసుకోవడం వల్ల శరీరానికి ద్రవాలు, పోషకాలు అందడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరుకు తోడ్పడవచ్చు. బరువు నియంత్రణలో భాగంగా కూడా దీన్ని తీసుకోవచ్చు. అయితే రసం కంటే పండును పూర్తిగా తినడం ద్వారా పీచుపదార్థం ఎక్కువగా లభిస్తుంది.

ఫుల్లుగా విటమిన్ సి, మినరల్స్.. 100ల సమస్యలకు సహజ ఔషధం ఈ పండు..
Mosambi Benefits
Shaik Madar Saheb
|

Updated on: Oct 12, 2026 | 12:51 PM

Share

మన ప్రకృతిలో లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ అమూల్యమైన పోషక విలువలను కలిగి ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది సిట్రస్ కుటుంబానికి చెందిన బత్తాయిపండు.. ఇది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక సహజ ఔషధం. విటమిన్ సి తో పాటు పొటాషియం, ఫాస్ఫరస్, వివిధ మినరల్స్ బత్తాయిలో పుష్కలంగా లభిస్తాయి. దీనిని నేరుగా తీసుకున్నా లేదా జ్యూస్ రూపంలో సేవించినా అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

పిల్లల ఆరోగ్యానికి రక్షణ కవచం:

బత్తాయి పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు వారి శారీరక ఎదుగుదలకు, ముఖ్యంగా జ్ఞాపకశక్తి పెంపుదలకు తోడ్పడతాయి. ఇది వారికి ఒక సహజసిద్ధమైన టానిక్‌గా పనిచేస్తుంది.

కీళ్ల నొప్పులు, అల్సర్‌ నుంచి ఉపశమనం:

కీళ్ల నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి బత్తాయి రసం ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు బత్తాయి పండ్ల రసంలో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల ఈ సమస్యల తీవ్రత తగ్గుతుంది. అలాగే, అల్సర్, పేగులలో పుండ్లు ఉన్నవారికి కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, పుండ్లు మానేందుకు సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి, రక్త శుద్ధికి:

బత్తాయి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) అభివృద్ధి చెందుతుంది. ఇది రక్త శుద్ధికి సహాయపడుతుంది. రక్తహీనత సమస్యను నివారించి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

శక్తినిచ్చే పానీయం:

డయేరియా వంటి కారణాలతో అలసిపోయి, నీరసంగా ఉన్నవారికి బత్తాయి పండ్ల రసం తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తిని చేకూరుస్తాయి.

గర్భిణులకు, కంటి చూపునకు:

కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్ సి అధికంగా ఉండే బత్తాయి గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. కడుపులోని శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు బత్తాయి రసంలో పుష్కలంగా ఉంటాయి. బత్తాయి పండ్ల రసంలో తేనె, నిమ్మరసంతో పాటు ఉసిరిని కలిపి తీసుకుంటే కంటి చూపు మరింత మెరుగుపడుతుంది. ఇది నరాలపై ఒత్తిడిని తగ్గించి, రక్త శుద్ధితో పాటు వీర్య అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.

క్యాన్సర్ నివారణ, బరువు తగ్గడం:

బత్తాయి పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్లు పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. సుమారు 70 గ్రాముల బత్తాయి పండులో కేవలం 40 క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది. ఈ తక్కువ క్యాలరీల కారణంగా బరువు తగ్గాలనుకునే వారికి బత్తాయి రసం ఒక మంచి ఎంపిక. ప్రతిరోజు ఖాళీ కడుపుతో బత్తాయి రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

జీర్ణక్రియ, ఎముకలకు బలం:

బత్తాయి రసం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. బి.పి. (రక్తపోటు), షుగర్ (మధుమేహం) నియంత్రణలో ఉంటాయి. అలాగే, ఎముకలు బలంగా తయారవడానికి కూడా ఇది తోడ్పడుతుంది.

సౌందర్య పోషణకు:

ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, బత్తాయి చర్మ సౌందర్యానికి కూడా ఉపకరిస్తుంది. బత్తాయి పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి, దానిని సున్నిపిండితో కలిపి నీటితో పేస్ట్‌లా తయారుచేసుకొని ముఖానికి రాసుకుంటే మృత కణాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా, నిగనిగలాడుతుంది. పలు సౌందర్య సాధనాల కంపెనీలు కూడా తమ ఉత్పత్తులలో బత్తాయిని ఉపయోగిస్తున్నాయి.

బత్తాయి పండ్లు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా బత్తాయి పండ్లను లేదా రసాన్ని తీసుకుని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని డైటీషియన్లు పేర్కొంటున్నారు. అయితే.. ఏమైనా సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఫుల్లుగా విటమిన్ సి, మినరల్స్.. వందల సమస్యలకు సహజ ఔషధం..
ఫుల్లుగా విటమిన్ సి, మినరల్స్.. వందల సమస్యలకు సహజ ఔషధం..
అందుకే షాలినిని ఉంచి నన్ను ఎలిమినేట్ చేశారు..
అందుకే షాలినిని ఉంచి నన్ను ఎలిమినేట్ చేశారు..
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI
బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..
బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..
ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..
ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..
పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!
పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?