బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు సిద్ధార్థ్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత తెలుగు, తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ వచ్చారు. తెలుగులో సిద్ధార్థ్ చేసిన బొమ్మరిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సిద్ధార్థ్. ఈ సినిమా తర్వాత.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం వంటి సూపర్ హిట్ చిత్రాలతో యూత్ ను అట్రాక్ట్ చేశాడు సిద్దార్థ్. అయితే ఆ తర్వాత తెలుగులో సిద్ధార్థ్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో పూర్తిగా తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేశాడు సిద్ధార్థ్.
ఇటీవల ఓరేయ్ బామ్మర్ధి, మహా సముద్రం వంటి చిత్రాలతో తిరిగి టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు సిద్ధార్థ్. ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సమాజంలో జరుగుతున్న ఘటనలపై తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు సిద్ధార్థ్. సినీ పరిశ్రమకు సంబంధించినవి.. రాజకీయాలు.. సామాన్య ప్రజలకు సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో కామెంట్స్ చేస్తుంటాడు సిద్ధార్థ్. ఇటీవల నాగాలాండ్ రాష్ట్రంలో జరిగిన ఘటనగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాడు సిద్ధార్థ్. ఇదిలా ఉంటే.. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో సిద్ధార్థి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.
“నేటి విషపూరిత సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్.. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడానికి.. వారిని ఆయుధాలుగా మార్చడానికి కోట్లాది రూపాయాలు ఖర్చు చేస్తున్నారు. ఏదీ దానంతట అదే జరిగే అవకాశం లేదు. చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారని స్టార్స్ అర్థం చేసుకోవాలి.. ఇకనైనా ప్రేమను.. ద్వేషాన్ని కొనుక్కోవడం మానేయండి” అంటూ పోస్ట్ చేశాడు సిద్ధార్థ్. దీంతో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఈ పోస్ట్ సమంతను ఉద్దేశించే కోణంలో పెట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల నాగచైతన్యతో విడాకుల అనంతరం సోషల్ మీడియాలో తాను ఎదుర్కోన్న ట్రోల్స్ గురించి చెప్పుకోచ్చింది సామ్. తన అభిప్రాయాలు నచ్చకపోతే వదిలేయాలని.. అసభ్యకరంగా ట్రోల్స్ చేయవద్దని సమంత కోరింది. సమంత ఇంటర్వ్యూ ప్రసారమైన కొద్దిగంటల్లోనే సిద్ధార్థ్ ఇలా ట్వీట్ చేయడంతో.. ఈ పోస్ట్ సమంతను ఉద్దేశించి పెట్టాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Crores of rupees are spent to maintain & weaponize fan groups in today’s toxic social media ecosystem. Nothing happens on its own. It’s important for “stars” to understand that their “fans” will eventually bite them too.
Stop paying for love…and hate.
— Siddharth (@Actor_Siddharth) December 8, 2021
Also Read: ఏపీలో టికెట్ ధరల తగ్గింపు నిర్ణయంపై నిర్మాతల అసహనం.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్..