విలక్షణ నటనతో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు నటుడు సముద్రఖని(Samuthirakani). దర్శకుడిగా , రచయితగా రాణించిన సముద్రఖని ఇప్పుడు విలన్ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. అలవైకుంఠపురంలో, క్రాక్, భీమ్లానాయక్ లాంటి సినిమాలతో అదరగొట్టిన సముద్ర ఖని.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఎంపీ రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రఖని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్యాంక్ ఉంచి వేల కోట్ల అప్పు తీసుకొని ఎగ్గొట్టే వ్యక్తిగా సముద్రఖని నటన మెప్పించింది. తాజాగా సర్కారు వారి పాట సినిమా గురించి సముద్రఖని మాట్లాడుతూ.. సినిమా పై మహేష్ బాబు నటన పై ప్రశంసలు కురిపించారు.
‘సర్కారివారి పాట’ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు పరశురామ్ చాలా మంది పేర్లను పరిశీలించాడట. అప్పుడు మహేశ్ బాబు నా పేరును సూచించడం వలన నాకు అవకాశం వచ్చింది. మహేశ్ బాబుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఒక సూపర్ స్టార్ నోటి నుంచి నా పేరు రావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు సముద్రఖని. మహేశ్ బాబు గారు చాలా గొప్ప ఆర్టిస్ట్. మహేష్ బాబు ‘మురారి’ సినిమాను ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు అన్నారు సముద్రఖని. అలాగే ‘మహర్షి’ .. ‘భరత్ అనే నేను’ సినిమాలను కూడా చాలాసార్లు చూశాను. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మహేష్ బాబు తెరపై కనిపిస్తే ఆయనను మాత్రమే చూస్తుంటాను .. ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది పట్టించుకోను. అలాంటి ఒక హీరో.. ఈ సినిమా కోసం నన్ను సిఫార్స్ చేయడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం అని చెప్పుకొచ్చారు సముద్రఖని. మహేష్ ఎదురుగా నిలబడి ఆయనను చూస్తూ నటించడమనేది అంత తేలికైన విషయమేం కాదు. మహేశ్ బాబు సినిమాలో ఛాన్స్ రావడమనేది ఒక గిఫ్ట్ లాంటిది అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :