మోస్ట్ అవైయిటెడ్ చిత్రం విరాటపర్వం (Virata Parvam). రానా దగ్గుబాటి, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నక్సలైట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో రానా నక్సలైట్ రవన్న పాత్రలో నటిస్తుండగా.. సాయి పల్లవి వెన్నెల పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఇటీవల కర్నూలు వేదికగా ట్రైలర్ ఈవెంట్ నిర్వహించిన చిత్రయూనిట్.. సోమవారం విజయవాడ, గుంటూరు జిల్లాలో ప్రెస్ మీట్స్ నిర్వహించింది. ఇందులో డైరెక్టర్ వేణు ఉడుగులతోపాటు.. రానా దగ్గుబాటి, సాయి పల్లవి పాల్గోన్నారు.
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ” ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలనే ఉద్దేశంతో దర్శకుడు నాకు మూడు పేజీల్లో స్క్రిప్ట్ పంపించారు.. హీరోయిన్ ప్రధానంగా ఉండే సినిమా కావడంతో హీరోలు ఎవరు నటించేందుకు ముందుకు రావడం లేదని తెలిసిందే. దీంతో నేను హీరోహీరోయిన్ అనే సంబంధం లేకుండా కథ నడిచే సినిమాలు చూస్తూ పెరిగాను.. సింధూరం, అంతఃపురం సినిమాల ప్రభావం నాపై బాగా ఉంది. విరాటపర్వం సినిమామ కూడా అలాంటిదే. అందుకే ఈ మూవీలో నటించేందుకు సిద్దమయ్యాను.. ఇందులో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఆమె చాలా మంచి మనిషి.. ఆమె మంచితనం ప్రభావం నాపై పడింది. ఇప్పుడు నేను కూడా మంచివాడిలా ఫీలవుతున్నా.. ” అంటూ చెప్పుకొచ్చారు.