Ram Charan: అయ్యప్పమాలలో కడప దర్గాకు వెళ్లడంపై రచ్చ.. గట్టిగా ఇచ్చి పడేసిన రామ్ చరణ్ భార్య

గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. అక్కడ జరిగిన 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే అయ్యప్ప మాలలో ఉండి దర్గాను దర్శించుకోవడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

Ram Charan: అయ్యప్పమాలలో కడప దర్గాకు వెళ్లడంపై రచ్చ.. గట్టిగా ఇచ్చి పడేసిన రామ్ చరణ్ భార్య
Ram Charan Family

Updated on: Nov 20, 2024 | 4:34 PM

సినిమా షూటింగులతో బిజీగా ఉండే గ్లోబల్ స్టార్ ఇటీవల కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు. 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడి సమీపంలోని విజయ దుర్గ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన రాబోయే సినిమా స్క్రిప్టును అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా అయ్యప్ప మాలలో ఉంటున్నాడు రామ్ చరణ్. అయితే గతంలో ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమన్ కు ఇచ్చిన మాట ప్రకారం అయ్యప్ప స్వామి మాలలోనే కడప దర్గాను దర్శించుకున్నారు. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ పై నెట్టింట విమర్శలు చేస్తున్నారు. వీటిపై మెగా పవర్ స్టార్ స్పందించకున్నా ఆయన సతీమణి ఉపాసన కొణిదెల మాత్రం స్పందించింది. రామ్ చరణ్‌ అన్ని మతాలను గౌరవిస్తుంటారని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.

 

ఇవి కూడా చదవండి

తన సోషల్ మీడియా ఖాతాలో చరణ్ దర్గాలో ప్రార్థనలు చేస్తోన్న ఫొటోను షేర్‌ చేస్తూ సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే గీతాన్ని జోడించింద ఉపాసన ‘దేవుడిపై విశ్వాసం అందరినీ ఏకం చేస్తుంది. అంతే కానీ చిన్నాభిన్నం చేయదు. భారతీయులుగా మేం అన్ని మత విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మా బలం ఉంది. రామ్‌చరణ్‌ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలనూ ఎప్పుడూ గౌరవిస్తుంటారు’ అని రాసుకొచ్చింది ఉపాసన. దీనికి ‘వన్‌ నేషన్‌.. వన్‌ స్పిరిట్‌’ అని హ్యాష్‌ ట్యాగ్ కూడా జోడించింది మెగా కోడలు.

ఉపాసన పోస్ట్ ఇదిగో..

ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మెగాభిమానులు, నెటిజన్లు ఆమెకు మద్దతు పలుకుతూ కామెంట్స్ పెడుతున్నారు.

చిల్డ్రన్స్ డే వేడుకల్లో రామ్ చరణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us