దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లె తెరకెక్కించిన ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇటీవల ఆర్ఆర్ఆర్ మేకర్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఓమిక్రాన్, కరోనా ఎఫెక్ట్‌తో ఈ మూవీ వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. దీంతో మెగా, నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఆర్ఆర్ఆర్ మేనియా కొనసాగుతుంది. ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ యూట్యూబ్‌ను షేర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూవీలోని నాటు నాటు పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తారక్, చరణ్ కలిసి వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీరిద్దరూ కలిసి వేసిన స్టెప్పులను ఇప్పటివరకు ఎంతో మంది అభిమానులు వేస్తూ నెట్టింట్లో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నాటు నాటు పాటకు.. తారక్, చరణ్ స్టెప్పులకు హీరో మాధవన్ ఫిదా అయ్యారు. ఈపాటలోని స్టెప్పులను ఎడిట్ చేసిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి వారిద్దరి పై ప్రశంసలు కురిపించారు. ” “ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టె్ప్పులు అద్భుతంగా ఉన్నాయి. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం.. సమన్వయం నాలో ఈర్ష్య పుట్టేలా చేస్తున్నాయి. నాకు అసూయ కలుగుతుంది. అయిన మీరిద్దరి పట్ల గర్వంగా ఉంది. హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్టర్ లో పేర్కోన్నారు. కాగా మ్యాడీ ట్వీట్ కు ఆర్ఆర్ఆర్ టీం థ్యాంక్యూ మ్యాడీ అంటూ రిప్లై ఇచ్చారు. తన ట్వీట్‌కు స్పందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీంను ఉద్దేశిస్తూ మ్యాడీ ‘భారత్‌లో బాక్సాఫీస్ కలెక్షన్లను మీరు తిరిగి రాయబోతున్నారు’’అంటూ మరో ట్వీట్ చేశారు. వెంటనే ‘‘మేము సిద్ధంగా ఉన్నాం. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం సర్! దేశంలోని థియేటర్ సమస్యలను అతి త్వరలో అధిగమిస్తామని ఆశిస్తున్నాము!’’అంటూ మ్యాడీ ట్వీట్‌కు స్పందించింది ఆర్ఆర్ఆర్ టీం.
❤️ Thank you Maddy Sir!! #RRRMovie https://t.co/lMtJHFRQcp
— RRR Movie (@RRRMovie) January 4, 2022
We are geared up and just waiting for the right moment to blast sir!! Hope we overcome the theatre issues in the nation very very very soon! ? #RRRMovie https://t.co/OAJrk5vazh
— RRR Movie (@RRRMovie) January 4, 2022
Also Read: Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి