Tollywood: ఒలింపిక్ మెడల్ నా టార్గెట్ అంటోన్న టాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు.. దినచర్య ఏంటో తెలుసా?

తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సినిమాల్లో స్టార్ గా వెలుగొందుతోన్న ఈ హీరోకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు అతని కుమారుడు ఏకంగా ఇంటర్నేషన్ రేంజ్ కు ఎదిగిపోయాడు. ఒక ప్రొఫెషనల్ స్విమ్మిర్ అయిన ఈ స్టార్ కిడ్ భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున పతకం తీసుకురావాలని కలలు కంటున్నాడు.

Tollywood: ఒలింపిక్ మెడల్ నా టార్గెట్ అంటోన్న టాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు.. దినచర్య ఏంటో తెలుసా?
Vedanth

Updated on: Jul 17, 2025 | 8:36 AM

సాధారణంగా సినిమా హీరోలు/హీరోయిన్ల వారసులందరూ సినిమాల్లోకే ఎంట్రీ ఇస్తుంటారు. అమ్మానాన్నల అడుగు జాడల్లోనే నడుస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటుంటారు. అయితే ఈ స్టార్ హీరో కుమారుడు మాత్రం ఈత కొలనులో చేప పిల్లలా దూసుకెళుతున్నాడు. ప్రొఫెషనల్ స్విమ్మర్ గా వరుసగా పతకాలు సాధిస్తున్నాడు. ప్రతిష్టాత్మక మలేషియా ఓపెన్‌లో ఏకంగా ఐదు బంగారు పతకాలు సాధించాడీ స్టార్ కిడ్. ఆ తర్వాత డానిష్ ఓపెన్‌లో బంగారు, వెండి పతకాలు కూడా గెలుచుకున్నాడు. లాట్వియా, థాయిలాండ్ ఓపెన్‌లలో కాంస్య పతకాలు కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఒలింపిక్స్ లో భారత్ కు పతకం తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. ఇంతకీ అతనెవరని అనుకుంటున్నారా? ఒకప్పటి అమ్మాయిల ఫేవరెట్ హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్.

వేదాంత్ మాధవన్ ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున పతకం గెలవాలని అతను కలలు కంటున్నాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో, మాధవన్ తన కొడుకు అలవాట్లు, క్రమశిక్షణ గురించి బహిరంగంగా మాట్లాడాడు. “నా నటనను ప్రేక్షకులు ప్రశంసిస్తున్నప్పటికీ, నా కొడుకు వేదాంత్ మా కుటుంబంలో అత్యంత క్రమశిక్షణ కలిగినవాడు. అతను కఠినమైన క్రమశిక్షణను పాటిస్తాడు. ప్రొఫెషనల్ ఈతగాడు కాబట్టి, అతను ప్రతి ఉదయం 4 గంటలకు, అంటే బ్రహ్మ ముహూర్తానికి నిద్రలేచి, రాత్రి 8 గంటలకు పడుకుంటాడు’

ఇవి కూడా చదవండి

మాధవన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

‘దీనికి చాలా కృషి, పట్టుదల అవసరం. ఇది అతను మాత్రమే చేయవలసినది కాదు, తల్లిదండ్రులుగా మనం కూడా చేయాలి. బ్రహ్మ ముహూర్తానికి మేల్కొనడం అంత తేలికైన విషయం కాదు. ఆధ్యాత్మికత ప్రకారం, ఆ సమయంలో మేల్కొనడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే తినడం కూడా ఒక వ్యాయామం. వేదాంత్ తినే ఆహారం విషయంలో కూడా ఎంతో శ్రద్ద, మెలకువలు పాటిస్తాడు.అతను రోజువారీ జీవితంలో చిన్న చిన్న పనులను కూడా చాలా క్రమశిక్షణతో చేస్తాడు. నేను అతనిలాగే క్రమశిక్షణ కలిగి ఉండాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా సోమరిని.’ అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు మాధవన్.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.