మరి గడ్డి పీకమంటావా .? నెటిజన్ ప్రశ్న ప్రియదర్శికి చిర్రెతించింది.. అసలు ఏమైందంటే

తెలుగు చిత్రపరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్..పంచులు..ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్ ప్రియదర్శి. పెళ్లి చూపులు సినిమాలో చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ అతడి క్రేజ్ మారిపోయింది. ఆ సినిమాలో నా చావు నేను చస్తా అనే పుస్తకం రాస్తున్నా అంటూ ప్రియదర్శి చెప్పిన డైలాగ్ యూత్‏ను ఆకట్టుకుంది.

మరి గడ్డి పీకమంటావా .? నెటిజన్ ప్రశ్న ప్రియదర్శికి చిర్రెతించింది.. అసలు ఏమైందంటే
Priyadarshi

Updated on: Nov 21, 2025 | 4:18 PM

కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హీరోగా ఒకొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాడు నటుడు ప్రియాదర్శి.. కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో తన కామెడీ టైమింగ్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యేడు ప్రియదర్శి. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా చేశాడు. ఆతర్వాత హీరోగా మారి పలు సినిమా చేసి మెప్పించాడు. ఇక ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన సినిమాల్లో బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలగం సినిమాతో ప్రియదర్శి క్రేజ్ మారిపోయింది. తన నటనతో బలగం సినిమాకు వన్ ఆఫ్ ది హైలెట్ గా నిలిచాడు దర్శి. ఈ సినిమా తర్వాత ఇప్పుడు వరుసగా సినిమాలు చేసి మెప్పిస్తున్నాడు.

నన్ను అలా చూస్తే ఆ డైరెక్టర్ ఊరుకుంటాడా..? ఓపెన్‌గా మాట్లాడిన హీరోయిన్

ఇక కోర్టు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే చివరిగా మిత్రమండలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా తప్ప ప్రియదర్శి ఎంచుకున్న కథలన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ప్రేమంటే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

రెండు పెళ్లిళ్లు.. రెండుసార్లు విడాకులు.. ఇప్పుడు సింగిల్‌గా ఇలా.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో అస్క్ మీ అనే చిట్ చాట్ చేశాడు ప్రియాదర్శి. ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు ప్రియదర్శి. ఓ నెటిజన్ సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ అన్న మానే అంటూ  కామెంట్ చేశాడు. దానికి సమాధానం ఇస్తూ.. సినిమాలు ఆపేసి ఏం చేయాలి గడ్డి పీకమంటావా .? అని సమాధానం ఇచ్చాడు ప్రియదర్శి. ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దీని పై నెటిజన్స్ రకర్తకాలుగా స్పందిస్తున్నారు.

వరుణ్ తేజ్‌కు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్.. హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us