Nagababu: మీరే నా బలం.. నా జీవితం.. బ్రదర్స్ పై నాగబాబు ఎమోషనల్ కామెంట్స్..

| Edited By: Ravi Kiran

Aug 24, 2021 | 7:54 PM

మెగాస్టార్ చిరంజీవి.. పుట్టిన రోజు వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో తెలిసన విషయమే. బర్త్ డేకు ముందు నుంచే ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేసిన

Nagababu: మీరే నా బలం.. నా జీవితం.. బ్రదర్స్ పై నాగబాబు ఎమోషనల్ కామెంట్స్..
Mega Brothers
Follow us on

మెగాస్టార్ చిరంజీవి.. పుట్టిన రోజు వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో తెలిసన విషయమే. బర్త్ డేకు ముందు నుంచే ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఇక చిరు బర్త్ డే ముందు నుంచే ఆయన తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా రివీల్ అవుతూ.. అభిమానులకు వరుస ట్రీట్స్ ఇచ్చేసాయి. ఇక ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు మాత్రమే కాకుండా రాఖీ పౌర్ణమి కూడా కావడంతో చిరు ఇంట్లో రెండు పండగల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్, నాగబాబు వరుణ్ తేజ్, అల్లు అరవింద్ ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరూ చిరు ఇంటికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

చాలా కాలం తర్వాత చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు.. పవన్, చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్‏స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నా ప్రతి మైలులో మరిన్ని చిరునవ్వులు నింపడానికి.. ప్రతి క్షణంలో మ్యాజిక్ సంజీవంగా ఉండడానికి నా బ్రదర్స్.. @Chiranjeevikonidela #Pawankalyan నా బలం, నా జీవితం మీరు ఇద్దరే.. అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. నాగబాబు షేర్ చేసిన ఫోటోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ నాగబాబు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ముగ్గురిని ఇలా ఓకే ఫ్రేములో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ట్వీట్..

Also Read: Sonu Sood Reaction: రూ. కోటి అడిగిన అభిమాని.. అంతే స్పెషల్‌గా స్పందించిన సోనూ సూద్‌..

Pranavi Manukonda: ఇన్‌స్టాలో ప్రణవి మానుకొండ క్రేజ్.. ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పిన స్మాల్ స్క్రీన్ బ్యూటీ

Abhishek Bachchan: షూటింగ్‌లో గాయపడిన అభిషేక్ బచ్చన్.. ఆలస్యంగా వెలుగులోకి.. ఆందోళనలో ఫ్యాన్స్