Mohan Babu: మోహన్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో సోదరుడు మృతి..

|

Nov 17, 2021 | 9:11 PM

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు (63) తుదిశ్వాస

Mohan Babu: మోహన్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో సోదరుడు మృతి..
Mohan Babu
Follow us on

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు (63) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గుండె పోటుకు గురైన ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం కన్నుముశారు. రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

మోహన్ బాబు సోదరుడు రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం 9 గంటలకు తిరుపతి గోవింద ధామం వద్ద నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. రంగస్వామి తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మోహన్ బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. రంగస్వామి మృతితో మోహన్ బాబు కుటుంబం, సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Also Read: KTR and Samantha: మంత్రి కేటీఆర్‌పై సమంత ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌..

Pushpaka Vimanam: బాలీవుడ్ రీమేక్‏లో పుష్పక విమానం.. ఆనంద్ దేవరకొండ సినిమాకు భారీగా డిమాండ్ !!

RNR Manohar: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు.. దర్శకుడు కన్నుమూత..