ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను.. చాలా నేర్చుకున్నానన్న కృష్ణుడు

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, హ్యాపీడేస్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు కృష్ణుడు. ముఖ్యంగా వినాయకుడు సినిమాలో హీరోగా అతని అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పదుల సినిమాల్లో నటించిన కృష్ణుడు ఆ మధ్యన పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు.

ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను.. చాలా నేర్చుకున్నానన్న కృష్ణుడు
Krishnudu

Updated on: Oct 04, 2026 | 6:18 PM

టాలీవుడ్‌లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు, సన్నిహితులు ఉన్నారు. ముఖ్యంగా ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు పూరి వర్కింగ్ స్టైల్ గురించి తరచూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుంటారు. తాజాగా నటుడు కృష్ణుడు కూడా పూరి జగన్నాథ్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమా టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పూరి జగన్నాథ్‌కు ఉన్న ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ మరింత బలంగా ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే తనకు పూరితో ఉన్న అనుబంధం నటుడిగా ప్రారంభం కాలేదని కృష్ణుడు వెల్లడించారు. పోకిరి సినిమా సమయంలో ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం తనకు లభించిందని తెలిపారు. ఆ సమయంలో పూరి జగన్నాథ్ పని చేసే విధానాన్ని దగ్గరగా గమనించే అవకాశం రావడం తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు.

చిరంజీవి, వెంకటేష్‌లతో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? సోషల్ మీడియాను ఊపేస్తుందిగా..

పోకిరి తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో నటుడిగా మంచి పాత్రను దక్కించుకున్నానని కృష్ణుడు గుర్తు చేసుకున్నారు. ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత అదే దర్శకుడి సినిమాలో నటుడిగా అవకాశం రావడం తన ప్రయాణంలో ప్రత్యేకమైన అనుభవమని పేర్కొన్నారు. పూరి జగన్నాథ్‌తో పనిచేసిన ఈ రెండు దశలు తన కెరీర్‌లో చాలా ముఖ్యమైనవిగా నిలిచిపోయాయని కృష్ణుడు తెలిపారు. పూరి జగన్నాథ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడిన కృష్ణుడు.. ఆయనలో ఉండే ఎనర్జీ, ఉత్సాహం తనను ఎప్పుడూ ఆకట్టుకునేవని చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పూరి చాలా చురుగ్గా ఉంటారని, పని ఒత్తిడి ఉన్నప్పటికీ దాని ప్రభావం తనపై కనిపించనివ్వకుండా ఉండేవారని పేర్కొన్నారు.

ఎవర్రా నువ్వు..! బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవల్

సెట్‌లో ఆయన వ్యవహరించే తీరు చాలా కూల్‌గా ఉన్నప్పటికీ.. సినిమా విషయంలో మాత్రం చాలా స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారని కృష్ణుడు వివరించారు. పూరి జగన్నాథ్‌కు సినిమా విషయంలో పూర్తి క్లారిటీ ఉంటుందని కృష్ణుడు అన్నారు. ఒక సన్నివేశం ఎలా ఉండాలి, నటుడి నుంచి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ రావాలి అనే విషయాలపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంటుందని తెలిపారు. నటీనటులతో సన్నివేశాలను చేయించుకునే విషయంలో కూడా పూరికి ప్రత్యేకమైన శైలి ఉందని, ఎక్కువ సమయం తీసుకోకుండా తనకు కావాల్సిన అవుట్‌పుట్‌ను రాబట్టుకోగలరని కృష్ణుడు ప్రశంసించారు. పూరి జగన్నాథ్‌తో పనిచేసినప్పుడు తాను నేర్చుకున్న విషయాల్లో సమయపాలన కూడా ఒకటని కృష్ణుడు పేర్కొన్నారు. సెట్‌లో వాతావరణం ఎంత సరదాగా ఉన్నప్పటికీ పని విషయంలో మాత్రం పూరి చాలా కచ్చితంగా ఉంటారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

10th క్లాస్ మూడుసార్లు ఫెయిల్ అయ్యా.. ఖచ్చితంగా డైరెక్టర్ అవుతానంటున్న స్టార్ హీరో కూతురు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us