Karthi : ఎంత క్యూట్‏గా ఉంది రా బాబూ.. హీరో కార్తీ కూతురుని చూశారా.. ? ఫోటోస్ వైరల్..

కోలీవుడ్ స్టార్స్ సూర్య, కార్తీ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తమిళంలోనే కాకుండా వీరిద్దరికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇక సూర్య ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడూ ఏదోక న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంటాయి.

Karthi : ఎంత క్యూట్‏గా ఉంది రా బాబూ.. హీరో కార్తీ కూతురుని చూశారా.. ? ఫోటోస్ వైరల్..
Karthi

Updated on: Dec 19, 2025 | 10:42 AM

కోలీవుడ్ నటుడు శివకుమార్ నటవారసులుగా సినీరంగంలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటులు సూర్య, కార్తీ. హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్న కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తెలుగు, తమిళంలో ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాల్లో నటించి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. సూర్యతోపాటు ఆయన తమ్ముడు కార్తీ సినిమాలకు మాత్రం సేపరేట్ ఫ్యా్న్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. పరుత్తి వీరన్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన కార్తీ.. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఇవి కూడా చదవండి : Dhurandhar: బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న ధురంధర్.. ఈ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో తోపు హీరోయిన్..

ఊపిరి, ఆవారా, సత్యం సుందరం వంటి సినిమాలతో తెలుగులోనూ ఫేమస్ అయ్యాడు. ఖైదీ, సర్కార్ వంటి చిత్రాలు కార్తీ కెరీర్ ను మలుపు తిప్పాయి. కార్తీ ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ‘వా వాతియార్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుంది. సత్యరాజ్, రాజ్ కిరణ్ తదితరులు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి : Anand Movie : జస్ట్ మిస్.. ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. దెబ్బకు లైఫ్ మారిపోయేది కదా..

ఈ చిత్రం ఈనెల 12న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమా కాకుండా కార్తీ చేతిలో సర్దార్ 2, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కార్తీ. ఇదెలా ఉంటే కార్తీ ఫ్యామిలీ బయట ఎక్కువగా కనిపించదు. 2011లో రంజనిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఉమయ్యల్ అనే కుమార్తె ఉంది. కార్తీ ఇప్పటివరకు తన కుమార్తెతో కలిసి ఎటువంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాలేదు. తాజాగా కార్తీ తన కూతురితో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైన వీడియో నెట్టింట వైరలవుతుంది. కార్తీ కూతురు ఎంతో క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : డీమాన్ దెబ్బకు మారిన ఓటింగ్.. ఆఖరి రోజు ఊహించని రిజల్ట్..

Karthi Daughter

ఇవి కూడా చదవండి : Akhanda 2: అఖండ2లో బాలయ్య కూతురిగా నటించాల్సిన అమ్మాయి ఈమె కాదట.. స్టార్ హీరో కూతురు మిస్సైందిగా..