
ప్రముఖ నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి తన జ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తిని పంచుకున్నారు. దర్శకుడిగా, రచయితగా, నటుడిగా అన్ని విషయాలను తెలుసుకోవాలని తాను కోరుకుంటానని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే భగవద్గద్గీత, ఖురాన్, బైబిల్ వంటి అనేక పవిత్ర గ్రంథాలను చదివినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా ఒక కొటేషన్ చెప్పినా లేదా దానికి సంబంధించి ఏదైనా చేయాలనుకున్నా వాటిపై అవగాహన ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ మంచి పవిత్ర గ్రంథాలని, వీటిని చదవడంలో ఎటువంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
ఖురాన్‌ను అరబిక్ భాషలో ఎలా నేర్చుకున్నారని అడిగిన ప్రశ్నకు, ఏదైనా తెలుసుకోవాలని ఇష్టపడితే, ఏ భాషనైనా నేర్చుకోవచ్చని జేడీ చక్రవర్తి బదులిచ్చారు. నేను అందరికీ చదవండి.. నేర్చుకోండి అనే సందేశం ఇస్తానని ఆయన వెల్లడించారు. ఈ విధంగా ఆయన విభిన్న గ్రంథాలపై తనకున్న ఆసక్తిని, అధ్యయన పద్ధతిని తెలియజేశారు.
శివ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన జేడీ చక్రవర్తి.. ఆ తర్వాత కాలంలో హీరోగా స్టార్ స్టేటస్ అందుకున్నారు. 2023లో వచ్చిన దయ వెబ్ సిరీస్ తర్వాత ఆయన మరో ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.