Harshavardhan: ఈఐఎంలు కడుతున్నారా? అయితే ఇలా చేస్తే చాలా బెటర్.. నటుడు హర్షవర్ధన్ మనీ సేవింగ్ టిప్స్

నితిన్ హీరోగా నటిస్తోన్న అలియాస్ రుక్మిణీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు హర్షవర్ధన్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Harshavardhan: ఈఐఎంలు కడుతున్నారా? అయితే ఇలా చేస్తే చాలా బెటర్.. నటుడు హర్షవర్ధన్ మనీ సేవింగ్ టిప్స్
Harshavardhan

Updated on: Nov 27, 2026 | 3:18 PM

టాలీవుడ్ లో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో హర్షవర్ధన్ ఒకరు. అమృతం సీరియల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ నటుడు మాటల రచయిత కూడా. అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. కెరీర్ ప్రారంభంలో శాంతి నివాసం, కస్తూరి తదితర సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు హర్షవర్ధన్. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించారు. కొన్ని సినిమాల్లో విలన్ గానూ యాక్ట్ చేశారు. కొండవీటి సింహాసనం, ఐతే, అతడు, అనుకోకుండా ఒక రోజు, అతడు, రాఖీ, స్టాలిన్, లక్ష్మీ కల్యాణం, లీడర్, పౌర్ణమి, గోల్కొండ హైస్కూల్, లవ్లీ, గబ్బర్ సింగ్, గోవిందుడు అందరి వాడేలే, గీతాంజలి, బ్రూస్లీ, ఊపిరి, 118, బ్రోచేవారెవరురా, జాంబిరెడ్డి, అక్షర, ఏక్ మినీ కథ, పుష్పక విమానం, సేనాపతి, స్వాతి ముత్యం, హిట్ ది సెకెండ్ కేస్, సుందరం మాస్టర్, సరిపోదా శనివారం, మారుతీ నగర్ సుబ్రమణ్యం, కోర్టు, పరదా, మన శంకరవర ప్రసాద్ గారు తదితర సినిమాల్లో హర్షవర్ధన్ పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు నితిన్ హీరోగా నటిస్తోన్న అలియాస్ రుక్మిణీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారీ సీనియర్ నటుడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఆర్థిక క్రమశిక్షణ,అమ్మానాన్నలతో ఉండే అనుబంధం తదితర విషయాలపై ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘సాధారణంగా ఏదైనా వస్తువు కొనాలంటే ఈఎంఐ జోలికి వెళ్లడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఉదాహరణకు ఒక పది లక్షల రూపాయల కారు కొనాలనుకుంటే, ఆ మొత్తం డబ్బు చేతిలో ఉన్నప్పుడే ఒకేసారి కట్టి కొనేయాలనే ఆలోచన నారే ఉంటుంది. అప్పులు చేసి, ప్రతినెలా ఈఎంఐలు కట్టే టెన్షన్ పెట్టుకోవడం కంటే ప్రశాంతంగా బతకడం ముఖ్యం. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్న ఫైనాన్షియల్ అవేర్‌నెస్ వీడియోలు చూస్తుంటే నా ఆలోచన అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. పది లక్షల రూపాయలు ఒకేసారి కారుపై పెట్టే బదులు, కొంత డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్‌లో మంచి లాభం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. డబ్బు సంపాదించడం మాత్రమే జీవితం కాదు. ఆ డబ్బు కోసం మనకు ఇష్టం లేని పనులు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. అందుకే నాకు వచ్చే ఆఫర్లలో నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటాను. అందరూ తమ ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు పెట్టుకుంటూ భవిష్యత్ కోసం కొంతైనా సేవ్ చేసుకోవాలి. జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈరోజు బాగా సంపాదిస్తున్నాం కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే రేపు టైం బాగోలేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.’

ఇక బయట ఫ్రెండ్స్‌తో గంటలు గంటలు బాతా ఖానీ కొట్టడానికి , సినిమాలకు తిరగడానికి మనకు టైమ్ ఉంటుంది.. కానీ. ఇంట్లో ఉండే అమ్మానాన్నలతో కనీసం పది నిమిషాలు కూర్చుని మాట్లాడటానికి మాత్రం సమయం ఉండట్లేదు. ఈ విషయంలో గతంలో నేను కూడా తప్పులు చేశాను. అమ్మకు అన్ని సౌకర్యాలు కల్పించి, డబ్బు ఇస్తే సరిపోతుందనుకున్నాను. కానీ ఆమెతో కాసేపు సరదాగా మాట్లాడటమే అసలైన ప్రేమ అని లేటుగా తెలుసుకున్నాను. డబ్బుతో మనం ప్రపంచంలో ఏ వస్తువునైనా కొనుక్కోవచ్చు కానీ, తల్లిదండ్రులతో గడిపే విలువైన సమయాన్ని మాత్రం తిరిగి కొనలేం’ అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us