
యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి (Harsh Kanumilli).. సిమ్రాన్ చౌదరి (Simran Chawdary) జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సెహరి (Sehari). ఈ సినిమాను వర్గో పిక్చర్స్ పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మిస్తుండగా.. డైరెక్టర్ జ్ఞానసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సెహరి అంటే ఏంటీ భయ్యా అనే డైలాగ్లో ట్రైలర్ ప్రారంభమైంది.
సెహరి అంటే సెలబ్రేషన్స్, ఆలియాను చేసుకోమంటే అక్కను తగులుకున్నావేంట్రా వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరో పార్ట్నర్ కోసం వెతకడం.. నిశ్చితార్థం నుంచి పారిపోవడం వంటి సన్నివేశాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. హర్ష్ కనుమిల్లి ఈ చిత్రానికి కథా రచయితగా వ్యవహరించారు. అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించారు. రవితేజ గిరిజాల ఎడిటర్. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నారు.