Vijay Sethupati: విజయ్ సేతుపతి పై క్రిమినల్ కేసు.. ఎయిర్ పోర్టు ఘటనలో హీరోకు బిగుస్తున్న ఉచ్చు..

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు నమోదైంది. విజయ్ సేతుపతితోపాటు.. అతని మేనేజర్ జాన్సన్‏లపై

Vijay Sethupati: విజయ్ సేతుపతి పై క్రిమినల్ కేసు.. ఎయిర్ పోర్టు ఘటనలో హీరోకు బిగుస్తున్న ఉచ్చు..
Vijay Sethupathi

Updated on: Dec 08, 2021 | 11:29 AM

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు నమోదైంది. విజయ్ సేతుపతితోపాటు.. అతని మేనేజర్ జాన్సన్‏లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సైదాపేట కోర్టులోకేసు వేశారు. గత నెలలో బెంగుళూరు విమానాశ్రయంలో విజయ సేతుపతి పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగుళూరు విమానాశ్రయంలో విజయ్

గాంధీ అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన విజయ్ సేతుపతి మేనేజర్.. ఇతర భద్రతా సిబ్బది అతడిని వారించారు. ఈ ఘటన ఇప్పటితో విజయ్ సేతుపతిని వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే పరువు నష్టం దావా వేసిన గాంధీ..తాజాగా క్రిమినల్ కేసు పెట్టారు. నవంబర్ 2న తాను మెడికల్ చెకప్ కోసం మైసూర్ వెళ్తున్నానని.. బెంగుళూరు ఎయిర్ పోర్టులో సేతుపతిని కలిశానని.. ఇద్దరి మధ్య అపార్థాలు రావడంతో విజయ్ సేతుపతితోపాటు అతని మేనేజర్ జాన్సన్ తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కోన్నాడు.

తాను కూడా నటుడిని కాబట్టి విజయ్ సేతుపతిని పలకరించానని..సూపర్ డీలక్స్ చిత్రానిగానూ.. విజయ్ సేతుపతికి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చినందుకు అతడిని ప్రశంసించినట్లు తెలిపారు. అయితే విజయ్ తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. తన కులాన్ని కించపరిచడాని ఫిర్యాదులో పేర్కోన్నాడు. తనపై జరిగిన దాడిలో తన చెవికి దెబ్బ తగిలిందని… దీంతో చెవి పూర్తిగా వినిపించడం లేదని చెప్పాడు. అంతేకాకుండా.. అతను విజయ్ సేతుపతి.. అతని మేనేజర్ పై అసలు దాడి చేయలేదని తెలిపాడు.

అలాగే ఘటన జరిగిన సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానని విజయ్ సేతుపతి ప్రచారం చేశాడని.. దీంతో తన పరువు ప్రతిష్టకు భంగం కలిగిందని.. గతంలో రూ. 3 కోట్లు పరువు నష్టం దావా వేశారు గాంధీ.

Also Read: Bigg Boss 5 Telugu: పర్ఫామెన్స్‎తో రెచ్చిపోయిన సన్నీ.. హగ్గులతో షణ్ముఖ్ పరువు తీశాడుగా..

Payal Rajput: పాయల్ రాజ్‏పుత్‏ను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..

Singer Chinmayi: చిన్మయికి మద్దతు తెలిపిన ఆ ఇద్దరూ.. స్క్రీన్ షాట్స్ బయటపెట్టిన సింగర్..