
అక్రమంగా లగ్జరీ కార్లను కొనుగోలు చేశారన్న ఆరోపణలతో గత నెలలో కస్టమ్స్ అధికారులు దుల్కర్ సల్మాన్ తో పాటు పలువురు సినీ హీరోల ఇళ్లపై దాడులు నిర్వహించారు. దుల్కర్ ఇంట్లోని అన్నీ కార్లను తనిఖీలు చేశారు. కార్ల డాక్యుమెంట్స్, కొనుగోలు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేకపోవడంతో రెండు కార్లను సీజ్ కూడా చేశారు. నకిలీ పత్రాలతో కార్లను కొనుగోలు చేసి, తక్కువ ధరలకు విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నాడని దుల్కర్ సల్మాన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే మరో కొత్త కారు కొనుగోలు చేశాడు దుల్కర్ సల్మాన్. ఈ స్టార్ హీరో దగ్గర ఇప్పటికే 60 కి పైగా కార్లు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల కార్లతో పాటు పాత,ఐకానిక్ కార్లు కూడా దుల్కర్ గ్యారేజీలో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు కొన్నాడు. ఇప్పటికే ఈ బ్రాండ్ కారు హీరో గ్యారేజీలో ఉంది. అయితే ఇప్పుడు అతను 110 ఆక్టాను కొన్నాడు. ఇది ఆ కారు స్పెషల్ ఎడిషన్. ఈ కారుకు 4.4 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ ఉంటుంది. కేవలం నాలుగు సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ కారు. అంటే ఈ కారు రోడ్లు, మట్టి రోడ్లు, పర్వత మార్గాల్లోనూ సులభంగా ప్రయాణించగలదు. ఈ ఫీచర్స్ కారణంగానే దుల్కర్ సల్మాన్ ఈ కారును కొన్నాడు. ఇక ఈ లగ్జరీ కారు ధర సుమారు మూడు కోట్ల రూపాయలని తెలుస్తోంది.
కాగా దుల్కర్ సల్మాన్ గ్యారేజీలో మెర్సిడెస్, బెంజ్, పోర్షే, ఫెరారీ, వోల్వో వంటి బ్రాండెడ్ కంపెనీల కార్లు ఉన్నాయి. అలాగే 80, 90ల కాలం నాటి అత్యుత్తమ కార్లను కొనుగోలు చేసి తన గ్యారేజీలో ఉంచుకున్నాడు. BMW M3 సిరీస్ e 28, e 20, e 34, e 36, 46, 92 కార్లు దుల్కర్ కలెక్షన్‌లో ఉన్నాయి.
కాగా ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు దుల్కర్ సల్మాన్. ఇటీవల దుల్కర్ నిర్మించిన కొత్త లోక సినిమా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ జంటగా నటించారు. డైరెక్టర్ డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది.
Just @dulQuer & #Bhagyashree spreading smiles and dance vibes at the Kaantha promotions ✨💚”#DulquerSalmaan #Bhagyashree #Kaantha #KaanthaPromotions #DanceVibes #GoodEnergy #ReelMoments #siima pic.twitter.com/sKfDSMaugi
— SIIMA (@siima) November 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.