
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ , పవిత్ర గౌడ తోపాటు ఇతర నిందితులు పోలీసు కస్టడీ నేటితో (జూన్ 20) ముగిసింది, వారిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. జూన్ 11న రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దర్శన్, పవిత్రతో సహా కొంతమంది నిందితులను విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు, అయితే విచారణను విన్న న్యాయమూర్తి దర్శన్‌తో సహా కొందరిని రెండు రోజులు పోలీసు కస్టడీకి పంపారు, పవిత్రతో సహా కొంతమంది నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. .
దర్శన్, పవిత్ర ఇతర నిందితులు జూన్ 11నుంచి పోలీసుల కస్టడీలో ఉన్నారు. పోలీసులు ఇప్పటికే దర్శన్‌తోపాటు ఇతర నిందితులను బెంగళూరు, మైసూరు, చిత్రదుర్గ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి విచారించారు. ఇప్పటి వరకు దాదాపు 118 వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురి వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. అయితే విచారణ, ఇంకా పూర్తికాకపోవడంతో వారిలో కొందరిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.
దర్శన్, వినయ్, ప్రదోష్, నాగరాజ్, లక్ష్మణ్, ధన్‌రాజ్‌లను తిరిగి పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రిమాండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన నిందితులు పవిత్రాగౌడ్, పవన్, రాఘవేంద్ర, నందీష్, జగదీష్, అనుకుమార్, రవిశంకర్, దీపక్, కేశవమూర్తి, నిఖిల్ నాయక్ లను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
అయితే దర్శన్‌ను తిరిగి పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని దాఖలైన రిమాండ్ పిటిషన్‌పై అభ్యంతరం లేవనెత్తిన దర్శన్ తరఫు న్యాయవాది, ఇప్పటికే 10 రోజుల పాటు విచారణ జరిగిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. రిమాండ్ దరఖాస్తు కూడా తనకు అందలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే నిందితుల్లో ముగ్గురు విచారణకు సహకరించడం లేదని, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టుల ఆధారంగా విచారణ పెండింగ్‌లో ఉందని, మరో నాలుగు రోజులు రిమాండ్‌కు ఇవ్వాలని పోలీసుల తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. అయితే న్యాయమూర్తి దర్శన్ ను రెండు రోజుల పోలీసు కస్టడీకి పంపాలని ఆదేశించారు. కాగా జూన్ 20న ఐదు గంటలకు కోర్టు ముందు హాజరుపరచాలని ఆరు రోజుల క్రితం మేజిస్ట్రేట్ కోర్టు తెలిపింది. అదేవిధంగా 3:45 గంటలకు నిందితులందరినీ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు హాలులో లాయర్లు కిక్కిరిసిపోయారు. తాళ్లు కట్టి ప్రజలను అదుపు చేసేందుకు ఏర్పాట్లు చేసినా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.