Maa Elections 2021: తెలంగాణ బిడ్డలను గెలిపించండి.. అతడిని మాత్రం ఓడించండి.. సీవీఎల్ సంచలన కామెంట్స్..

|

Oct 06, 2021 | 6:05 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సమయం దగ్గరపడుతుండంతో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. బరిలో ఉన్న అభ్యర్థులు

Maa Elections 2021: తెలంగాణ బిడ్డలను గెలిపించండి.. అతడిని మాత్రం ఓడించండి.. సీవీఎల్ సంచలన కామెంట్స్..
Maa Elections
Follow us on

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సమయం దగ్గరపడుతుండంతో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై మరొకలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటారు. ఒక వైపు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు. మరొవైపు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు మాటల యుద్ధానికి దిగుతున్నారు. విమర్శలు, ఆరోపణలే కాకుండా.. ఫిర్యాదు వరకు వెళ్లింది మా ఎలక్షన్స్ వివాదం. ముందు నుంచి మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే అభ్యర్థుల విషయంలోనూ వరుస ట్విస్టులు చోటు చేసుకున్నాయి. నామినేషన్స్ వేసిన బండ్లగణేష్.. సీవీఎల్ వంటి వారు అనుహ్యాంగా తమ నామినేషన్స్ వెనక్కు తీసుకుని పోటీ నుంచి తప్పుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా నటుడు సీవీఎల్ మా ఎన్నికలపై స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. అందులో సీవీఎల్ మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికి నమస్కారం.. ఈ ఎన్నికలలో మీరు తెలంగాణ బిడ్డలందరిని దయచేసి గెలిపించండి. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‏గా బాబు మోహన్ గారిని.. జాయింట్ సెక్రటరీగా ఉన్న ఉత్తేజ్‏ను.. రెండు ప్యానల్లలో ఉన్న తెలంగాణ సభ్యులను గెలిపించండి. తెలంగాణ గడ్డ మీద ఉన్న మా కు సంబంధించినంతవరకు తెలంగాణ బిడ్డలు ఓడిపోతే మంచిది కాదు.. దేశమన్నా.. దేవుడన్న.. ధర్మమన్నా.. చులకన భావమున్న ప్రకాష్ రాజ్‏ను ఓడించండి. అతను .. నేను నేను తప్ప మరో విషయం పట్టని మనిషి.. అతను ఈ ఎన్నికలలో పోటీ చేయకుండా ఉంటే బాగుంటుంది.. విత్ డ్రా చేసుకుంటాడని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.

వీడియో..

Also Read: Bigg Boss 5 Telugu: ఇదే కదా కావాల్సింది.. కెప్టెన్సీ టాస్క్‏లో కంటెస్టెంట్స్ ఫుల్ ఫైర్.. ప్రోమో చూశారా ?

SamChaitanya: సమంత-నాగచైతన్య అందుకే దూరమయ్యారు.. మాధవిలత షాకింగ్ కామెంట్స్..

Akhanda: షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టిన అఖండ యూనిట్.. జోష్ లో బాలయ్య బాబు

Konda Polam: నేను కాకపోతే ఆ స్టార్ డైరెక్టర్ ‘కొండపోలం’ సినిమా చేసేవారే.. ఆసక్తికర విషయం చెప్పిన క్రిష్..