Brahmaji: అందరు హీరోలతో నటించాను.. ఆ ఒక్కడితో తప్ప.. నటుడు బ్రహ్మాజీ కామెంట్స్..

దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో ఎన్నో విభిన్నమైన సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలతో తనదైన ముద్ర వేసిన నటుడు బ్రహ్మాజీ. కెరీర్ తొలినాళ్లల్లో హీరోగా పరిచయమైన ఆయన.. ఆ తర్వాత ప్రతినాయకుడిగా, సహయ నటుడిగా, హాస్యనటుడిగా తకనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అందరూ హీరోలతో నటించిన ఆయన.. ఇప్పటివరకు ఆ ఒక్క హీరోతో నటించలేదు.

Brahmaji: అందరు హీరోలతో నటించాను.. ఆ ఒక్కడితో తప్ప.. నటుడు బ్రహ్మాజీ కామెంట్స్..
Brahmaji

Updated on: Jun 17, 2026 | 3:46 PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలతో, దశాబ్దాలుగా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. సీరియస్ విలన్ పాత్రల నుండి కడుపుబ్బా నవ్వించే కామెడీ క్యారెక్టర్ల వరకు దేనినైనా పండించగల ప్రతిభ ఆయన సొంతం. టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో కలిసి నటించిన అరుదైన రికార్డు బ్రహ్మాజీకి ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు అందరు హీరోలతో నటించానని.. కానీ ఒక్క హీరోతో మాత్రమే నటించలేదని అన్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసుకుందామా. ఆయన మరెవరో కాదు.. టాలీవుడ్ ‘ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్’ అల్లరి నరేష్. అవును.. వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదట. అలాగే తన సుదీర్ఘ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..

పరిశ్రమలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ బ్రహ్మాజీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. “నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఉన్న దాదాపు అందరు హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. నేటి తరం యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో నటించే అవకాశం నాకు దక్కింది. అయితే నా కెరీర్‌లో ఒకే ఒక్క స్టార్ హీరోతో మాత్రం ఇప్పటివరకు కలిసి నటించే ఛాన్స్ రాలేదు. ఆయనతో ఎప్పుడో నటించే ఛాన్స్ వస్తుందిలే అంటుంటాను” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..

ఇదే క్రమంలో ‘ఇవివి’ వారసుడు అల్లరి నరేష్ గురించి బ్రహ్మాజీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అల్లరి నరేష్ కామెడీ టైమింగ్, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం అద్భుతమని అన్నారు. నరేష్ సినిమాల్లో నటించడం ఎప్పుడూ ఒక మంచి అనుభూతిని ఇస్తుందని, సెట్స్‌లో వాతావరణం చాలా సరదాగా ఉంటుందని గుర్తుచేసుకున్నారు. ఒకవైపు నవ్వులు పూయిస్తూనే, మరోవైపు ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి చిత్రాలతో వైవిధ్యమైన నటనను ప్రదర్శించగల సత్తా నరేష్‌కు ఉందని ప్రశంసించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..

అల్లరి నరేష్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

Follow Us