Bharani Shankar: అతని మనసు బంగారం..! ఆ స్టార్ హీరో నాకు తమ్ముడులాంటి వాడు..!!

బిగ్ బాస్ పుణ్యమా అని నటుడు క్రేజ్ మరింత పెరిగింది. ఎన్నో సినిమాల్లో నటించిన భరణి.. విలన్ గా మెప్పించాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్నాడు భరణి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భరణి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Bharani Shankar: అతని మనసు బంగారం..! ఆ స్టార్ హీరో నాకు తమ్ముడులాంటి వాడు..!!
Bharani Shankar

Updated on: Apr 08, 2026 | 8:33 PM

బిగ్ బాస్ 9 ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైన నటుడు భరణి, అంతకు ముందు విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రస్థానం, అలాగే పలువురు అగ్రతారలతో తన అనుభవాలను పంచుకున్నారు భరణి. ఈ సందర్భంగా తన తల్లికి, మెగాస్టార్ చిరంజీవికి, సాయి ధరమ్ తేజ్ కు, రామ్ చరణ్ కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భరణి తన తల్లిని ఒక గొప్ప మహిళగా అభివర్ణించారు. తన తండ్రి మరణానంతరం, కుటుంబ బాధ్యతలు తన తల్లిపై పడినప్పుడు ఆమె చూపిన ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తనను ఎప్పుడూ ఆకలితో పడుకోనివ్వలేదని, ఏదో ఒక రకంగా అవసరాలను తీర్చేవారని తెలిపారు. తన నిర్ణయాలు సరైనవా కాదా అని తెలియకపోయినా, తన తల్లి ఒక పిల్లర్ లా అండగా నిలిచారని, మానసికంగా బలమైన వ్యక్తిగా తన వద్ద ప్రవర్తించేవారని చెప్పారు. తన తల్లి చేసిన త్యాగాల వల్లనే తనకు మహిళల పట్ల అపారమైన గౌరవం పెరిగిందని భరణి పేర్కొన్నారు.

నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి

తన కెరీర్‌లో మర్చిపోలేని కాంప్లిమెంట్లు అందుకున్న సందర్భాలను భరణి పంచుకున్నారు. “తూర్పు పడమర” సీరియల్‌లో అంకయ్య దొర పాత్రను దాసరి గారు రాశారని, ఆ పాత్రకు తన తల్లి నుండి అద్భుతమైన ప్రశంస లభించిందని తెలిపారు. అలాగే ముకుంద” సినిమా రిలీజ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు తనను పేరు పెట్టి పిలిచి, తన నటనను ప్రశంసించారని తెలిపారు. చిరంజీవి గారు తన భుజంపై చేయి వేసి నువ్వు చాలా బాగా చేస్తావయ్యా, రోజూ చూస్తాను సీరియల్ అని చెప్పినప్పుడు తనకు అది ఒక మైలురాయిగా అనిపించిందని భరణి గుర్తు చేసుకున్నారు.  సాయి ధరమ్ తేజ్‌తో తనకున్న అనుబంధం గురించి భరణి ప్రత్యేకంగా మాట్లాడారు.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

తేజ్‌ను సొంత తమ్ముడిలా భావిస్తానని, అపోలో జిమ్‌లో ఇద్దరూ కలిసే వర్కౌట్లు చేస్తారని చెప్పారు. తేజ్ చాలా మంచి వ్యక్తి అని, కల్మషం లేని మనసున్నవాడని, ప్రజల పట్ల ప్రేమ, అభిమానం ఉన్న వ్యక్తి అని వర్ణించారు. తేజ్ “బంగారం” అని, దేవుడు అతనికి మంచి విజయాలను, కెరీర్‌ను ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. తేజ్ అప్‌కమింగ్ సినిమా “సంబరాల యేటి గట్టు” సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, సంజీత్ లతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

హీరో లేడు.. ఫైట్స్, స్పెషల్ సాంగ్స్ లేవు..! కట్ చేస్తే నాలుగేళ్లుగా ఓటీటీలో తిరుగులేని సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us