
ఓవైపు సినిమాలు.. మరోవైపు కారు రేసులతో బిజి బిజీగా గడుపుతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. గత రెండు నెలల కాలంలో అతను నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే ఈ మధ్యలోనే వివిధ దేశాల్లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లోనూ పాల్గొన్నాడు అజిత్. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసిన పద్మ భూషణ్ అవార్డును అందుకున్నాడీ హీరో. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యుకు హాజరైన అజిత్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే సినిమాలు, రేసింగులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ‘సినిమాలు.. రేసింగులు.. ఈ రెండింటికీ నేను సరైన న్యాయం చేయలేకపోతున్నానని నాకు అర్థమవుతోంది. అందుకే ఇప్పటి నుంచి రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. రేసింగ్‌కు ఫిట్‌నెస్ ఎంతో అవసరం. చాలా రోజుల తర్వాత కార్ల రేస్‌పై దృష్టిపెట్టినప్పుడు ముందు శారీరకంగా బలంగా మారాలని అర్థమైంది’
‘ సినిమాలు, రేసింగులు ఒకే సమయంలో ఉంటే ఆ రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నా. దానివల్ల ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే ఇప్పటి నుంచి రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కార్ రేసింగ్ చేస్తున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఇంకా నిజం చెప్పాలంటే.. నా సినిమాల్లో స్టంట్స్ నేనే చేస్తా. దానివల్ల నాకెన్నో సర్జరీలు జరిగాయి. అలా అని యాక్షన్ సినిమాలు విడిచి పెట్టలేను కదా.. అదేవిధంగా ప్రమాదాలు జరిగాయని కార్ రేసింగ్‌కు దూరం అవ్వలేను. నా దృష్టిలో ఈ రెండూ ఒకే లాంటివి’ అని అజిత్ చెప్పుకొచ్చారు.
AK getting ready for the qualification 😎 man is fully pumped up and focused 🔥 #AjithKumarRacing #Ajithkumar #goodbadugly pic.twitter.com/o7rG7f5Fge
— Vignesh AK🇸🇬 (@IamAjithVignesh) May 17, 2025
కాగా విదాయుమిర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు అజిత్. తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఇంకా అప్ డేట్ రావాల్సి ఉంది.
Some pics of Ajith sir with fans at the Zandvoort circuit.
| #AK #Ajith #Ajithkumar | #GoodBadUgly | #AjithKumarRacing | #GT4Series | #AKRacing | #Avracing | Pic: Megha, Ansari , Ponraj | pic.twitter.com/BrZgMh3kjO
— Ajith (@ajithFC) May 17, 2025