
అల్లు అర్జున్ తన నట జీవితంలోని తొలినాళ్ల అనుభవాలను, ముఖ్యంగా ఆర్య సినిమాకు ముందు ఎదురైన పరిస్థితులను ఓ ఈవెంట్‌లో పంచుకున్నారు. ఆయన తొలి సినిమా గంగోత్రి విజయం సాధించినప్పటికీ, అందులో నటుడిగా తాను ప్రత్యేక గుర్తింపు పొందలేకపోయానని పేర్కొన్నారు. ఈ కారణంగా, అల్లు అర్జున్ దాదాపు ఒక సంవత్సరం పాటు సినిమాలు ఓకే చేయకుండా ఖాళీగా గడిపారు. ఈ సమయంలో రోజుకు మూడు కథలు వింటూ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో సినిమాలు చూస్తూ గడిపారు. ఎలాగైనా సినిమా చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న సమయంలో, అల్లు అర్జున్ ప్రసాద్ ల్యాబ్స్‌కు వెళ్లారు. అక్కడ దర్శకుడు సుకుమార్ మొదటిసారి ఆయనను చూసి, కథ చెప్తానని ముందుకు వచ్చారు. సుకుమార్ వివరించిన కథ అల్లు అర్జున్‌కు అద్భుతంగా నచ్చింది. ఇడియట్ సినిమా చూసినప్పుడు తనకు ఇలాంటి యూత్ సినిమా లైఫ్‌లో పడుద్దా అని అనుకునేవాడినని, సుకుమార్ కథ విన్నప్పుడు అది తనకు ఇడియట్ లాంటిదే అనిపించిందని అల్లు అర్జున్ వెల్లడించారు. ఈ కలయిక అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచిన ఆర్య సినిమాకు దారి తీసింది.
కాగా అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చి ఆర్య, ఆర్య2, పుష్ప1, పుష్ప 2 సినిమాలు బ్లాక్ బాస్టర్స్ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలతో వారి స్థాయి అమాంతం పెరిగింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..