నటసింహం నందమూరి బాలకృష్ణ కు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను అమితంగా అభిమానించేవారు దేశ విదేశాల్లో ఉన్నారు. అభిమానులపై బాలయ్య చేయి చేసుకున్న సందర్భాలు కొన్ని ఉన్నప్పటికీ ఆయన మనసు బంగారం. అభిమానులంటే ఆయనకు చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో ఆయన అభిమానులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న తానా సదస్సులో పాల్గొన్నారు బాలకృష్ణ. కుటుంబంతో కలిసి బాలకృష్ణ ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. అక్కడ అభిమానులను కలిశారు బాలయ్య. ఓ అభిమాని బాలకృష్ణకు బంగారు ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అభిమాని ఇచ్చిన ఆ బంగారు ఉంగరం బాలయ్యకు బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ ఉంగరం పై సింహం బొమ్మ ఉందట దాంతో అది బాలయ్యకు బాగా నచ్చిందట. బాలయ్యకు సింహం సెంటిమెంట్ అన్న విషయం తెలిసిందే. ఆయన సినిమా టైటిల్స్ లోనూ సింహం ఉండేలా చూసుకుంటారు మన నటసింహం
ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు.