
నైన్టీస్ కిడ్స్.. ఇప్పుడు అడల్ట్స్‌గా మారి.. చాలా యాంగ్జైటీ, డిప్రెషన్‌కి గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వారు తమ ముందు జనరేషన్.. ఆ తర్వాత జనరేషన్‌కి మధ్య ఇమడలేక తీవ్రమైన మానసిక సంఘర్షణకి లోనవుతూ ఉంటారు. అసలు ఆ రోజులే వేరు. నైన్టీస్ కిడ్స్ చూసినంత జనరేషన్ ఛేంజస్ ఎవరూ చూసి ఉండరు. ఫోన్, ఇంటర్నెట్ లేని పరిస్థితుల నుంచి.. స్మార్ట్ ఫోన్స్, హై స్పీడ్ డేటా, వైఫై, కరోనా పాండమిక్, ఆఖరికి ఇండో-పాక్ వార్ కూడా ఎన్నో ఘటనలకు వారు విట్‌నెస్. అయితే నైన్టీస్ కిడ్స్ ఎంత లోగా ఉన్నా.. వారిని ఓదార్చే, వారి మనసుకు కాస్త రిలీఫ్ ఇచ్చే సీరియల్ సాంగ్ ఒకటి ఉంది. అదేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమృతం సీరియల్ టైటిల్ ట్రాక్. “ఒరేయ్ ఆంజనేలు…” సాంగ్ వినగానే మళ్లీ స్కూల్ బ్యాగ్ తగిలించుకుని బడికి పోతున్నట్టే అనిస్తుంది. ఈ పాట వింటున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అమృతం…. ఇది కామెడీ కాదు.. చిన్నప్పటి జ్ఞాపకాలు…పాట వచ్చి అన్నీ ఏళ్లు అయినా పవర్ మాత్రం తగ్గలేదు తగ్గదు కూడా. అమ్మ ఆవకాయ్ అమృతం ఎప్పుడు బోర్ కొట్టవు.
కాగా ఈ పాటను దివంగత, లెజండరీ లిరిసిస్ట్ దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. కల్యాణి మాలిక్ బాణీ కట్టడంతో పాటు ఆలపించారు. సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ అమృతం సీరియల్ పాటతో తన కెరీర్‌లో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పాట ఆయనకు, ప్రముఖ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్‌తో పాటు మరో ఇద్దరు కళాకారులకు సినీ రంగంలో తొలి అడుగు అని, వారందరూ దీనితోనే అరంగేట్రం చేశారని ఆయన వెల్లడించారు. ఆ రోజుల్లో ఈ పాట ఇంత పెద్ద విజయం సాధిస్తుందని, అమృతం సీరియల్ అప్పటి జనరేషన్‌కు అంతగా నచ్చుతుందని తాము అస్సలు ఊహించలేదని మాలిక్ పేర్కొన్నారు. అయితే, నేటికి 20 ఏళ్ల తర్వాత కూడా ఈ పాట ప్రేక్షకుల హృదయాల్లో చెక్కుచెదరని స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి జనరేషన్ మాత్రమే కాకుండా, ఇప్పటి తరం కూడా ఈ పాటను ఇష్టపడుతోంది. అమృతం ద్వితీయం పార్ట్ విడుదలైనప్పుడు కూడా ఈ పాటకు అంతే గొప్ప అప్లాజ్ వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. సినిమా పాటలు హిట్ అయినప్పుడు కలిగే సంతోషం కన్నా, అమృతం పాట అందించిన అనుభూతి తనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని కళ్యాణి మాలిక్ తెలిపారు. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా, స్వయంగా కళ్యాణి మాలిక్ ఆలపించారు. ఈ పాట చుట్టూ ఎన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు. కెరీర్ బిగినింగ్ లో భవిష్యత్తు తెలియని ఆందోళన ఉండేదని, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అదొక సరదా ప్రయాణంగా అనిపిస్తుందని మాలిక్ వివరించారు. తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు కనిపించే కష్టంతో పోల్చుతూ, ఎక్కాక కలిగే సంతృప్తిని ఈ పాట ప్రస్థానంతో పోల్చారు.
ఇప్పటికీ ఎంతోమంది ఈ పాటను తమ ఫేవరెట్ లిస్ట్‌లో ఉంచుకున్నారని, మూడ్ బాగోనప్పుడు ఈ పాట వింటే మనసు రిలాక్స్ అవుతుందని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తనకు మెసేజ్‌లు వస్తుంటాయని కళ్యాణి మాలిక్ గర్వంగా తెలిపారు. ఒక సినిమా పాట కన్నా అమృతం పాట విషయంలో ప్రశంసలు అందుకున్నప్పుడు ఎక్కువ సంతోషం కలుగుతుందని ఆయన చెప్పారు. ఈ పాట నేటికీ శ్రోతలను తెలియని ట్రాన్స్‌లోకి తీసుకువెళ్లి, ఒత్తిళ్లను మర్చిపోయేలా చేస్తుందని, అందుకే చాలాసార్లు వినాలనిపిస్తుందని ప్రేక్షకులు చెబుతారని మాలిక్ పేర్కొన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..