Simran: అది నా జీవితంలో ఓ అందమైన ప్రేమలేఖ!.. ఆ నాటి మధుర క్షణాలు గుర్తు చేసుకున్న సిమ్రాన్..

సన్నజాజి తీగలాంటి సిమ్రాన్ గ్లామర్ రోల్స్ లోనే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న అన్ని పాత్రల్లో మెప్పించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన సిమ్రాన్ స్టార్ హీరోయిన్ గా రాణించారు. అప్పట్లో లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుంది ఈ భామ. చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సిమ్రాన్ ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టారు.

Simran: అది నా జీవితంలో ఓ అందమైన ప్రేమలేఖ!.. ఆ నాటి మధుర క్షణాలు గుర్తు చేసుకున్న సిమ్రాన్..
Simran

Updated on: Feb 17, 2024 | 11:09 AM

సిమ్రాన్.. ఒకప్పుడు ఈ చిన్నదానికి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది సిమ్రాన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. సన్నజాజి తీగలాంటి సిమ్రాన్ గ్లామర్ రోల్స్ లోనే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న అన్ని పాత్రల్లో మెప్పించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన సిమ్రాన్ స్టార్ హీరోయిన్ గా రాణించారు. అప్పట్లో లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుంది ఈ భామ. చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సిమ్రాన్ ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టారు. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు సిమ్రాన్. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా సిమ్రాన్ ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు.

సిమ్రాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. అలాంటి సినిమాల్లో అమృత మూవీ ఒకటి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో కన్నతిల్ ముత్తమిట్టల్ పేరుతో తెరకెక్కింది. తెలుగులోకి అమృతగా వచ్చింది. ఈ సినిమా సుజాత రచించిన “అముతవుం అవనుమ్” అనే చిన్న కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సిమ్రాన్ , కీర్తన నటించగా నందితా దాస్, జేడీ. చక్రవర్తి, ప్రకాష్ రాజ్, పశుపతి ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలై 22 ఏళ్ళు అవుతున్న సందర్భంగా సిమ్రాన్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

“ఇందిరా( సిమ్రాన్ పాత్ర పేరు).., నా జీవిత ప్రయాణంలో ఓ అందమైన ప్రేమలేఖ! ఆమె ఒక పాత్ర కంటే ఎక్కువ; ఆమె ఒక మ్యూజ్, ఆ  స్ఫూర్తిని నేను నాతో తీసుకువెళతాను . జీవితంలోని గొప్ప బహుమతుల్లో ఒకటిగా ఆదరిస్తాను” అంటూ రాసుకొచ్చారు సిమ్రాన్. 14 ఫిబ్రవరి 2002న విడుదలైంది ఈ సినిమా. ఈ చిత్రం 2002 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అలాగే 2003 శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఈ చిత్రంనికి ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, ఆరు సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు, ఏడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు అదే విధంగా ఆరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చలనచిత్ర అవార్డుల వచ్చాయి.

సిమ్రాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.