త్వరలో చైనాలో విడుద‌ల కానున్న 2.0

| Edited By:

Mar 02, 2019 | 7:20 PM

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ 2.0. ర‌జనీకాంత్‌, అక్ష‌య్ కుమార్, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘన‌ విజ‌యం సాధించింది. ర‌జ‌నీకాంత్ కెరియ‌ర్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా 2.0 నిలిచింది. ర‌జ‌నీకాంత్‌కి దేశ‌, విదేశాల‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేప‌థ్యంలో 2.0 చిత్రాన్ని చైనాలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించారు. హెచ్‌వై మీడియా సంస్థ ఇప్ప‌టికే చిత్ర డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ ద‌క్కించుకోగా మేలో చిత్ర […]

త్వరలో చైనాలో విడుద‌ల కానున్న 2.0
Follow us on

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ 2.0. ర‌జనీకాంత్‌, అక్ష‌య్ కుమార్, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘన‌ విజ‌యం సాధించింది. ర‌జ‌నీకాంత్ కెరియ‌ర్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా 2.0 నిలిచింది. ర‌జ‌నీకాంత్‌కి దేశ‌, విదేశాల‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేప‌థ్యంలో 2.0 చిత్రాన్ని చైనాలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించారు. హెచ్‌వై మీడియా సంస్థ ఇప్ప‌టికే చిత్ర డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ ద‌క్కించుకోగా మేలో చిత్ర విడుద‌ల‌కి ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే చైనాలో ఈ చిత్రం ‘బాలీవుడ్ రోబో 2.0: రిస‌ర్జెన్స్’ అనే టైటిల్‌తో విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.