Tollywood: యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్ హీరో.. ఎందుకంత క్రేజ్ అంటే

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరు. సినీ నేపథ్యంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీనివాస్ కు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అల్లుడు శ్రీను సినిమాతో తెరంగేట్రం చేసినా రాక్షసుడు సినిమాతో పెద్ద హిట్ కొట్టడానికి ఐదేళ్లు పట్టింది. మెల్లమెల్లగా తన ఇమేజ్ ను పెంచుకోవడంతో పాటు మార్కెట్ వాల్యూ కూడా సంపాదించుకున్నాడు.

Tollywood: యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్ హీరో.. ఎందుకంత క్రేజ్ అంటే
Bellamkonda

Updated on: Feb 22, 2024 | 1:09 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరు. సినీ నేపథ్యంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీనివాస్ కు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అల్లుడు శ్రీను సినిమాతో తెరంగేట్రం చేసినా రాక్షసుడు సినిమాతో పెద్ద హిట్ కొట్టడానికి ఐదేళ్లు పట్టింది. మెల్లమెల్లగా తన ఇమేజ్ ను పెంచుకోవడంతో పాటు మార్కెట్ వాల్యూ కూడా సంపాదించుకున్నాడు. అయితే హిందీలో తన డబ్బింగ్ సినిమాలకు మార్కెట్ క్రియేట్ చేసుకోగలగడం ఆయన కెరీర్ లో బిగ్ ఎలిమెంట్. అయితే ఈ హీరో సినిమాలు చాలా వరకు యాక్షన్, ఫైట్స్ తో నిండిన కమర్షియల్ సినిమాలే కావడంతో హిందీ ప్రేక్షకులు వాటికి త్వరగా కనెక్ట్ కాగలిగారు. ఇప్పుడు అదే విషయంలో శ్రీనివాస్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

బెల్లంకొండ ఫ్లాప్ సినిమాలు కూడా యూట్యూబ్ లో భారీ వ్యూస్ రాబట్టగలిగాయి. ఆయన తీసిన కవచం సినిమాకు 830 మిలియన్లకు పైగా వ్యూస్ (పలు ఛానల్స్ లో) రాగా, బోయపాటి శ్రీనుతో కలిసి జయ జానకి నాయక పేరుతో హిందీలో 800 మిలియన్ (ఆల్ టైమ్ రికార్డ్) వ్యూస్ ను క్రాస్ చేసింది. కాజల్ అగర్వాల్ నటించిన సీత చిత్రం హిందీలో 650 మిలియన్ వ్యూస్ దాటింది.

అన్ని సినిమాలు యూట్యూబ్ లో సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మరే భారతీయ నటుడు కూడా ఈ ఘనత సాధించడానికి దగ్గరగా లేడు. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఛత్రపతిని హిందీలో రీమేక్ చేయాలని ప్రయత్నించినా అది వర్కవుట్ కాలేదు. అయినా మంచి స్క్రిప్ట్ తో నార్త్ బెల్ట్ బాక్సాఫీస్ నెంబర్స్ తో సర్ ప్రైజ్ చేయగలడు శ్రీనివాస్. దానికి కావాల్సిందల్లా సరైన స్క్రిప్ట్. ప్రస్తుతం శ్రీనివాస్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.